News August 20, 2025
రైతులకు స్వయంసహాయక సంఘాలు ఉపయోగపడాలి: కలెక్టర్

గ్రామాల్లో సుస్థిర, జీవనోపాధులను నెలకొల్పేందుకు రైతులకు ఆర్థిక పరిపుష్టి చేకూర్చేలా, రైతు ఉత్పత్తి సంస్థలు స్వయంసహాయక సంఘాలను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో గ్రామీణాభివృద్ధి, బ్యాంకింగ్, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో DRDA PD రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
Similar News
News April 4, 2026
కడప: ఒక్క రోజులో 238 కేసులు నమోదు

కడప జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలపై 238 కేసులు నమోదు చేశారు. వాహనదారుల నుంచి రూ.46,590లు పెనాల్టీ వసూలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారుల్లో అన్ని రకాల వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. వాహనాలకు సంబంధించిన అనుమతి పత్రాలను, డ్రైవింగ్ లైసన్స్‌లను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
News April 3, 2026
కడప జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై 238 కేసులు నమోదు

కడప జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలపై 238 కేసులు నమోదు చేశారు. వాహనదారుల నుంచి రూ.46,590లు పెనాల్టీ వసూలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారుల్లో అన్ని రకాల వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. వాహనాలకు సంబంధించిన అనుమతి పత్రాలను, డ్రైవింగ్ లైసన్స్‌లను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
News April 3, 2026
కడప: రూ.లక్షలు కొట్టేసిన సైబర్ నిందితుడు అరెస్ట్

సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన 9 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశామని విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు. తాజాగా ఈ ముఠాకు సంబంధించి కడప జిల్లాకు చెందిన నగేషయ్యను అరెస్టు చేశామన్నారు. విశాఖలోని ఫుడ్ కార్పొరేషన్ ఇండియా విశ్రాంత ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి రూ.83 లక్షల వరకు దోచుకున్నారన్నారు. నిందితుడికి మణికంఠ, చందు అనే వారు బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్నట్లు గుర్తించామన్నారు.