News August 20, 2025

కృష్ణా: ప్రైవేటు స్కూల్స్‌కు P4 తప్పేలా లేదు..!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అధికారులు కోరుతున్నారు. ఈ కార్యక్రమం కింద ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఒకటి లేదా అంటేకంటే ఎక్కువ కుటుంబాలను దత్తత తీసుకొని, వారికి అన్ని విధాలా సహాయం చేయాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంపై వ్యతిరేకత వ్యక్తం చేయడంతో వారిని మినహాయించారు. ఎన్టీఆర్ జిల్లాలో 511, కృష్ణా జిల్లాలో 489 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి.

Similar News

News March 22, 2026

కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేం: CBN

image

1999-2004 మధ్య హైదరాబాద్‌ను శరవేగంగా అభివృద్ధి చేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. HYD ISBలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అప్పట్లో తాను కృషి చేయడం వల్లే జినోమ్ వ్యాలీ వచ్చిందని గుర్తు చేశారు. అనేక కారణాల వల్ల 2004లో ఓడిపోయామని, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పదేళ్లు పట్టిందన్నారు. 2014-19 వరకు APలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేమని తెలిపారు.

News March 22, 2026

అమరచింత: జూరాల ప్రాజెక్టు తాజా నీటిమట్టం

image

జూరాల ప్రాజెక్టులో ఆదివారం ఉదయం నాటికి 5.439 టీఎంసీల నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారి వెంకటేశ్ తెలిపారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2,228 క్యూసెక్కులు ఉండగా, మొత్తం అవుట్ ఫ్లో 8,888 క్యూసెక్కులుగా నమోదైంది. ఎడమ కాలువ ద్వారా 820 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News March 22, 2026

కర్నూలులో 23న ప్రజా ఫిర్యాదుల వేదిక: కలెక్టర్

image

ఈ నెల 23 (సోమవారం)న కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ, డివిజనల్, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని సూచించారు.