News August 20, 2025
ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మూత్రం పోయడంతో..

TG: వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలిపే ఘటన ఇది. సూర్యాపేటలో చక్రధర్(50) అనే వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మూత్ర విసర్జన చేయడంతో చనిపోయాడు. వర్షంతో ట్రాన్స్‌ఫార్మర్ ఉన్న ప్రాంతమంతా అప్పటికే తడిగా మారింది. దీంతో మూత్రం పోయగానే చక్రధర్‌కు షాక్ కొట్టి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేసి చూడగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
BE ALERT
Similar News
News August 20, 2025
అగ్ని-5 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం

ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని-5ను భారత్ విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఒడిశా చందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మిస్సైల్‌ను పరీక్షించారు. ఈ లాంఛ్ అన్ని ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్స్‌ను రీచ్ అయినట్లు పేర్కొంది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహించారు. ఇది ఇండియన్ ఆర్మీకి బిగ్గెస్ట్ అసెట్ కానుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
News August 20, 2025
సినీ రంగంలోనూ AI ప్రభావం.. నటీనటులకు గడ్డుకాలమేనా?

ఉద్యోగుల్లో భయాన్ని రేకెత్తిస్తోన్న AI ఇప్పుడు సినీ ఫీల్డ్‌నూ తాకింది. ఇప్పటికే పూర్తిగా ఏఐ ద్వారా రూపొందించిన ‘మహావతార్ నరసింహ’ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో నటీనటులు లేకపోయినా భావోద్వేగాలను సృష్టించొచ్చు అని ఇది నిరూపించింది. ఈక్రమంలో ఏఐతో సినిమాలు తీయడంపై బాలీవుడ్ దృష్టి పెడుతోంది. రామాయణ్, చిరంజీవి హనుమాన్ వంటి చిత్రాలను ఏఐతో రూపొందిస్తోంది. దీనిపై మీ కామెంట్?
News August 20, 2025
సౌదీలో స్కై స్టేడియం

FIFA వరల్డ్ కప్-2034 వేళ సౌదీ అరేబియా వినూత్న స్టేడియాన్ని నిర్మించనుంది. సౌదీ నిర్మించబోయే స్మార్ట్ సిటీలో ఇది ఏర్పాటుకానుంది. ది లైన్ అనే స్మార్ట్ సిటీలో ఎడారి తలానికి 350M ఎత్తులో నిర్మించనున్నారు. 46వేల మంది ప్రేక్షకులు కూర్చొనేలా దీనిని రూపొందించనున్నారు. ఇందుకు $1 బిలియన్‌ను ఖర్చు చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. 2027లో ప్రారంభించి 2032 నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.