News August 20, 2025
అమీన్పూర్: నేటి నుంచి మండల స్థాయి క్రీడా పోటీలు

సంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి ఈనెల 30 వరకు పది రోజుల పాటు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పోటీల్లో ఖోఖో, వాలీబాల్, కబడ్డీ మాత్రమే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీల కోసం విద్యార్థులను సిద్ధం చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
Similar News
News March 22, 2026
కాఫీ ఇలా తాగితే ఆరోగ్యం పక్కా!

చాలామంది కాఫీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భయపడతారు. కానీ ఫిల్టర్ చేసిన బ్లాక్ కాఫీ లివర్, గట్ హెల్త్‌కు చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. నిద్రలేచిన 60 నుంచి 90 నిమిషాల తర్వాత తాగడం బెస్ట్ టైమ్. రోజుకు 1-3 కప్పుల వరకు ఓకే. చక్కెర కలపకుండా తాగడం ముఖ్యం. అలాగే ఖాళీ కడుపుతో తాగొద్దు. ఆర్గానిక్ కాఫీ గింజలైతే బ్రెయిన్ షార్ప్‌గా ఉండటమే కాకుండా అల్జీమర్స్ వంటి రిస్కులు తగ్గుతాయి.
News March 22, 2026
పలాస: ప్రసవం తర్వాత బాలింత మృతి..!

పలాస CHCలో బాలింత మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. పలాస(M) దానకొరకు చెందిన మీనా ప్రభుత్వాసుపత్రిలో ఉదయం 9 గం.కు రెండో బిడ్డకు జన్మనిచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంటకు మీనా మెలకువలోకి వచ్చింది. కాసేపటికే ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. వైద్యలు వివిధ పరీక్షలు చేసి చికిత్స అందించినా రక్షించలేకపోయారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, కార్బొఎంబోలిజం కారణంగా మృతిచెందిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ పాపినాయుడు తెలిపారు.
News March 22, 2026
నేడే రైతు భరోసా నిధుల విడుదల

TG: రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. తొలి విడతలో ఒక ఎకరం భూమి వరకు రూ.6,000 చొప్పున మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ₹3,590 కోట్లు చేరనున్నాయి. మరో 20 రోజుల తర్వాత రెండో విడతగా ₹2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులు జమ కానున్నాయి.


