News August 20, 2025
సీఎం పర్యటన వాయిదా.. నిరాశలో ఆదివాసీలు

సీఎం బెండాలపాడు పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. దశాబ్ధాలుగా తాము ఎదురు చూస్తున్న సొంతింటి కల నెరవేరుతోందని, తాము గృహ ప్రవేశం చేయబోతున్నామని కొండంత అశతో ఉన్న ఆదివాసీలు నిరాశకు గురయ్యారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, అధికారుల హడావుడితో వారం రోజులుగా గ్రామంలో పండుగా వాతావరణం నెలకొంది. కానీ ఆయన పర్యటన వాయిదాతో స్తబ్దత ఏర్పడింది. సీఎం త్వరగా తమ గ్రామానికి రావాలని వారు ఆకాంక్షిస్తున్నారు.
Similar News
News August 20, 2025
శ్రీశైలం MLA తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

AP: అటవీ సిబ్బందితో శ్రీశైలం MLA రాజశేఖర్‌రెడ్డి <<17465291>>వివాదం<<>>పై CM చంద్రబాబు ఆరా తీశారు. ఘర్షణ జరిగిన తీరుపట్ల ఎమ్మెల్యేపై ఆయన మండిపడ్డారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై CM అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. CM ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News August 20, 2025
జియో యూజర్లకు మరో షాక్

జియో సంస్థ మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొలగించింది. రూ.799తో 84 రోజులపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1.5 GB డేటా, 100 SMSలు అందించే ప్లాన్‌ను రద్దు చేసింది. ఇక నుంచి ఈ సేవలు కావాలనుకుంటే యూజర్లు రూ.889తో రీఛార్జ్ చేసుకోవాలి. రూ.889 ప్లాన్‌లో జియో సావన్ ప్రో, జియో టీవీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి. కాగా రెండు రోజుల క్రితం రూ.249 ప్లాన్‌ను జియో తొలగించిన సంగతి తెలిసిందే.
News August 20, 2025
నిజామాబాద్: ప్రశాంతంగా PG, B.Ed పరీక్షలు.. 191 మంది గైర్హాజరు

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న PG, B.Ed పరీక్షలు 7పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయని అడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం జరిగిన PG 2,4సెమిస్టర్ల రెగ్యులర్,బ్యాక్ లాగ్ పరీక్షల్లో 2,366 మందికి గాను 2,240 మంది హాజరవగా,126 మంది గైర్హాజరయ్యారు. B.Ed 2,4సెమిస్టర్ల రెగ్యులర్,బ్యాక్ లాగ్ పరీక్షల్లో 1,444 మందికి గాను 1,379 మంది హాజరవగా 65 మంది గైర్హాజరయ్యారు.