News August 20, 2025

ఆ బిల్లు ఆపండి: అమిత్‌ షాకు AIGF లేఖ

image

బెట్టింగ్‌కు చెక్ పెట్టేందుకు కేంద్రం తెచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ <<17459059>>బిల్లును<<>> ఆపాలని హోంమంత్రి అమిత్ షాకు ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్(AIGF) లేఖ రాసింది. దీని వల్ల గేమింగ్ సెక్టార్‌‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. కోట్లాది మంది గేమర్లు ఇల్లీగల్ గ్యాంబ్లర్లుగా మారే ప్రమాదముందని తెలిపింది. ఒకేసారి బ్యాన్ చేయకుండా క్రమంగా నియంత్రించాలని సూచించింది. కాగా దేశంలో గేమింగ్ సెక్టార్ విలువ ₹2లక్షల కోట్లు.

Similar News

News August 20, 2025

ఈ నెల 23న ఖాతాల్లోకి డబ్బులు

image

AP: గతంలో నిలిచిపోయిన జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014-19 మధ్య జరిగిన పనుల బిల్లులను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పనులు చేసిన ఉపాధి హామీ శ్రామికుల ఖాతాల్లో ఈ నెల 23న రూ.145 కోట్లు జమ చేయనుంది.

News August 20, 2025

ICC ర్యాంకింగ్స్‌లోకి తిరిగొచ్చిన రోహిత్, కోహ్లీ!

image

టీమ్ ఇండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే బ్యాటర్ల <<17464301>>ర్యాంకింగ్<<>> లిస్టులోకి తిరిగొచ్చారు. ఇవాళ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో వారి పేర్లు మిస్ అయ్యాయి. దీంతో అటు క్రీడా వర్గాల్లో, ఇటు అభిమానుల్లో ఏం జరిగి ఉంటుందన్న చర్చ మొదలైంది. తాజాగా ICC టెక్నికల్ గ్లిచ్‌ను సరిచేయడంతో రోహిత్ 2, కోహ్లీ 4వ స్థానాల్లో ఉన్నట్లు చూపిస్తోంది. కాగా ఈ లిస్టులో గిల్ 1, శ్రేయస్ 8వ ర్యాంకులో ఉన్నారు.

News August 20, 2025

వారి పింఛన్లు తొలగిస్తాం: పార్థసారథి

image

AP: గత ప్రభుత్వం అనర్హులకూ దివ్యాంగుల పింఛన్లు ఇచ్చిందని మంత్రి పార్థసారధి ఆరోపించారు. ‘ఇప్పటివరకు 4.50 లక్షల మందిలో లక్ష మంది అనర్హులను గుర్తించాం. రీవెరిఫై చేయించుకోని వారికి మళ్లీ నోటీసులిస్తాం. అయినా ముందుకు రాకపోతే వారి పింఛన్లను నిలిపివేస్తాం. వైద్యులు అనర్హులు అని చెప్తే మరోసారి తమ అర్జీని మండల అభివృద్ధి అధికారికి/మున్సిపల్ కమిషనర్‌కు అందజేస్తే వారి అర్హతను పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు.