News August 20, 2025
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News August 20, 2025
పోలీసు శిక్షణా కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

అనంతపురం పోలీసు శిక్షణా కేంద్రాన్ని ఎస్పీ జగదీశ్ బుధవారం సందర్శించారు. త్వరలో కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణా తరగతులు ప్రారంభించనున్నారు. శిక్షణకు హాజరయ్యే వారికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు కల్పించాల్సిన అధికారులను ఆదేశించారు. సూచనలు చేశారు. అక్కడ చేపట్టాల్సిన పనుల గురించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
News August 20, 2025
ప్రకాశం: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్య సూచన!

గత డిసెంబర్, జనవరి నెలలలో ఒంగోలులోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కానిస్టేబుల్ ఎంపికకు హాజరైన అభ్యర్థుల్లో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ జిల్లా పోలీస్ కార్యాలయానికి హాజరుకావాలని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ మాట్లాడుతూ.. ఉదయం 9 గంటలకు డాక్యుమెంట్స్ తీసుకుని 6 ఫొటోలతో, పత్రాలపై అటెస్ట్డ్ చేయించుకొని, ఒరిజినల్ పత్రాలను తీసుకురావాలన్నారు.
News August 20, 2025
ఈ నెల 23న ఖాతాల్లోకి డబ్బులు

AP: గతంలో నిలిచిపోయిన జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014-19 మధ్య జరిగిన పనుల బిల్లులను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పనులు చేసిన ఉపాధి హామీ శ్రామికుల ఖాతాల్లో ఈ నెల 23న రూ.145 కోట్లు జమ చేయనుంది.