News August 20, 2025

NZB: ‘5,275 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ’

image

నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా జిల్లాకు 67,529 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ఇందులో మంగళవారం వరకు 62,254 మెట్రిక్ టన్నుల యూరియాను విక్రయించారు. 5,275 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కాగా గత 2024 వానాకాలం సీజన్లో జిల్లాలో 68,244.8 మెట్రిక్ టన్నుల యూరియాను విక్రయించారు.

Similar News

News August 20, 2025

ఆర్మూర్: మినీ స్టేడియాన్ని సందర్శించిన జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి

image

ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియాన్ని జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి పవన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. ఆర్మూర్ క్రీడాకారుల సౌకర్యార్థం క్రీడా మైదానాన్ని ఉన్నతీకరిస్తామన్నారు. త్వరలో క్రీడా మైదానంలో వాలీబాల్, కబడ్డీ, కోకో, ప్లే ఫీల్డ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు గోపిరెడ్డి, మల్లేశ్ గౌడ్ పాల్గొన్నారు.

News August 20, 2025

భీమ్‌గల్ ఐ.టీ.ఐలో ATC ట్రైనింగ్ ప్రారంభం

image

భీమ్‌గల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ATC ట్రైనింగ్ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. యువతను ఈ కోర్సుల్లో చేర్పించడానికి వివిధ కళాశాల ప్రిన్సిపల్స్, మండల అధికారులతో ఎంపీడీవో సంతోష్ కుమార్ అవగాహన సమావేశం నిర్వహించారు. యువత ATC(6)కోర్సులో చేరి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలను పొందాలని సూచించారు.

News August 20, 2025

NZB: ‘ఇష్టారాజ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు’

image

పాలకవర్గం లేని కారణంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ (BLTU) రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ ఆరోపించారు. కార్మికులకు రావాల్సిన బకాయిలు రావడం లేదని, వారికి సంబంధించిన ఫైల్స్ ముందుకు కదలడం లేదన్నారు. దీనితో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు.