News August 20, 2025

వాగుల వద్ద సెల్ఫీల కోసం వెళ్లొద్దు: ఎస్పీ

image

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చెరువులు, వాగులు, వంకల వద్దకు వీడియోల కోసం సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.

Similar News

News August 20, 2025

గంబీరావుపేట: వరద ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ

image

గంభీరావుపేట, లింగన్నపేట మధ్య వరద ప్రవాహం పెరిగి రాకపోకలకు అంతరాయం కలగడంతో SP మహేష్ బి. గితే పరిశీలించారు. SI రమాకాంత్‌తో మాట్లాడిన ఎస్పీ, వరద ప్రవాహంలోకి ఎవరూ వెళ్లకుండా ఇరువైపులా బారికేడ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చోట్ల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, వరద నివారణకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

News August 20, 2025

గంభీరావుపేట: ‘పాడి పశువులను సద్వినియోగం చేసుకోవాలి’

image

పాడి పశువులను సద్వినియోగం చేసుకొని పేద కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. గంభీరావుపేట మండలం దేశాయిపల్లి గ్రామంలోని ప్రగతిభవన్ లో 17 మంది ఎస్సీ లబ్దిదారులకు ఒక్కరికి 2 చొప్పున మొత్తం 34 పాడి పశువులను కలెక్టర్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పంపిణీ చేసే పశువులు డెలీవరి తర్వాత 12 నుంచి 15 లీటర్ల పాలు ఇస్తుందన్నారు.

News August 20, 2025

ముస్తాబాద్: ‘విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు’

image

నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల SP మహేష్ బి గీతే అన్నారు. ముస్తాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తు విషయంలో ఎలాంటి అలసత్వం వహించద్దని సూచించారు. ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతిరోజు తనిఖీ చేయాలని ఆదేశించారు.