News August 20, 2025

కరీంనగర్: జర్నలిజం కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

image

2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కలువకుంట రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆసక్తిగల అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 10లోగా తమ దరఖాస్తులను తెలుగు విభాగంలో సమర్పించాలని అన్నారు. పూర్తి వివరాలకు కళాశాలను సంప్రదించాలన్నారు.

Similar News

News March 13, 2026

సంగారెడ్డి జిల్లాకు రూ.2.10 కోట్లు ఎంపీ నిధులు

image

మెదక్ ఎంపీ రఘునందన్ రావు కృషితో సంగారెడ్డి జిల్లాకు భారీగా ఎంపీ నిధులు మంజూరయ్యాయని బీజేపీ నేత రాజేశ్వర్ రావు దేశ్ పాండే తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద వివిధ మండలాల్లోని 21 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.2.10 కోట్లు అనుమతి లభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

News March 13, 2026

చరిత్రలో ఈ రోజు (మార్చి 13)

image

1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం (ఫొటోలో)
1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
1926: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత వి.రామచంద్రరావు జననం
1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖేల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో హతమార్చాడు

News March 13, 2026

ఖమేనీ భార్య బతికే ఉన్నారు: ఇరాన్ మీడియా

image

US, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ <<19282331>>ఖమేనీ భార్య<<>> మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదేహ్ చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఇరానియన్ మీడియా ఖండించింది. ఆమె బతికే ఉన్నారని IRGC అనుబంధ మీడియా సంస్థ ‘ఫార్స్’ న్యూస్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్‌ ముజ్తబా ఖమేనీ కూడా తన తొలి అధికారిక ప్రసంగంలో తల్లి మరణించారని ఎక్కడా ప్రస్తావించలేదు.