News August 20, 2025

విశాఖ: లాడ్జిలో బీటెక్ విద్యార్థి సూసైడ్

image

ఏయూలో బీటెక్ విద్యార్థి తమ్మినేని కౌశిక్(22) రామాటాకీస్ సమీపంలోని లాడ్జిలో విగతజీవిగా కనిపించాడు. కాకినాడకు చెందిన కౌశిక్ ఈనెల 10న లాడ్జిలో దిగాడు. ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో అమెరికాలో ఉన్న అతని అన్నయ్య కౌశిక్ ఫ్రెండ్స్‌కి కాల్ చేశాడు. వాళ్లు లాడ్జికి వెళ్లి చూడగా మరణించి ఉన్నాడు. ఘటనా స్థలంలో పాయిజన్ తాగి మృతి చెందిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. త్రీటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 8, 2025

విశాఖ జిల్లాలో 67.56% స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ పూర్తి

image

విశాఖ జిల్లాలో కేటాయించిన 5,17,155 స్మార్ట్ రైస్ కార్డులలో 67.56% పంపిణీ పూర్తయింది. మండలాల వారీగా అనందపురం 84.35%, భీమునిపట్నం 79.74%, సర్కిల్-III అర్బన్ 71.93%, సర్కిల్-I అర్బన్ 59.26% పూర్తి అయ్యాయి. మిగిలిన వారికి త్వరలోనే సచివాలయ సిబ్బంది/డీలర్ల ద్వారా అందజేస్తామని.. కార్డు వివరాలు epds పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ హరేంధీర ప్రసాద్ తెలిపారు.

News September 8, 2025

అధికారులపై విశాఖ కలెక్టర్ ఆగ్రహం

image

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల తీరుపట్ల కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్‌‌లో గతవారం ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. జీవీఎంసీ, పోలీసు శాఖ ఫిర్యాదుల్లో నాణ్యమైన పరిష్కారం దొరకడం లేదన్నారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంపై తరచూ ఫిర్యాదులు రావడంపై మండిపడ్డారు. ఇలాంటి తీరు పునరావృతం అయితే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.

News September 8, 2025

విశాఖ: సెప్టెంబర్ 10న స్థాయీ సంఘాల సమావేశం

image

జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు సెప్టెంబర్ 10న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరగనున్నాయని జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ జె.సుభద్ర ఆధ్వర్యంలో వి.సి.హాల్ సమావేశ మందిరంలో 1-7వ స్థాయీ సంఘాలు వేర్వేరుగా ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య జరుగుతాయని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రగతి నివేదికలతో హాజరుకావాలని కోరారు.