News August 20, 2025

‘ప్రపంచ దోమల దినోత్సవం’ పుట్టుకకు వేదిక సికింద్రాబాద్

image

బ్రిటిష్ వైద్యుడు సర్ రొనాల్డ్ రాస్ 1897 AUG 20న సికింద్రాబాద్‌లోని మిలిటరీ హాస్పిటల్లో పని చేస్తున్నప్పుడు దోమల్లో మలేరియా ప్లాస్మోడియం ఉనికిని గుర్తించారు. ఇవి మలేరియా వ్యాప్తికి మాధ్యమంగా పనిచేస్తాయని నిరూపించారు. ఈ ఆవిష్కరణ ఆయనకు 1902లో నోబెల్ తెచ్చిపెట్టింది. ఆయన ఆవిష్కరణను స్మరించుకునేందుకే ఈ ప్రపంచ దోమల దినోత్సవం మొదలైంది. ఈ రోజు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా గురించి అవగాహన కల్పిస్తారు.

Similar News

News March 8, 2026

ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం.. నేడు CBN హాజరు

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభాభిషేక వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం మొదలైన ఈ మూడు రోజుల క్రతువు ఇవాళ్టితో ముగియనుంది. నేడు ప్రధాన ఘట్టం జరగనుంది. ఆలయ విమాన గోపురంపై ఉన్న బంగారు కలశానికి పండితులు మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.

News March 8, 2026

T20 WC ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

image

INDvsNZ <<19325584>>ఫైనల్<<>> కోసం అహ్మదాబాద్ స్టేడియంలో మిక్స్‌డ్ సాయిల్ పిచ్ (70% రెడ్, 30% బ్లాక్) రెడీ చేశారు. బౌలర్లకు బౌన్స్ లభిస్తుంది. పేసర్లకు సహకరిస్తుంది. బ్యాటర్లకూ అడ్వాంటేజ్ ఉంటుందని, భారీ స్కోర్ నమోదవ్వొచ్చని అంచనా. Dew వచ్చే అవకాశముంది. దీంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే ఛాన్సుంది. ఈ పిచ్‌ను SAvsCAN (feb 9) మ్యాచుకు వాడారు. SA 213/4 స్కోర్(1st బ్యాటింగ్) చేసి, 57 రన్స్ తేడాతో గెలిచింది.

News March 8, 2026

6 నెలల పాటు యుద్ధానికి సిద్ధం: IRGC

image

ఇరాన్-ఇజ్రాయెల్, US యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. 6 నెలల పాటు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) స్టేట్ మీడియాకు వెల్లడించింది. ఇక అమెరికాతో యుద్ధంపై చర్చలకు వెళ్లబోమని ఇరాన్ ప్రకటించడంపై ట్రంప్ స్పందించారు. ఆ దేశంపై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అటు శనివారం 300 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.