News August 20, 2025
వరంగల్ మార్కెట్లో స్థిరంగా పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిన్నటిలాగే ఈరోజు స్థిరంగా ఉంది. మంగళవారం క్వింటా రూ.7,675 ధర పలకగా.. ఈరోజు సైతం అదే(రూ.7,675) ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఆశించిన స్థాయిలో ధర రావడం మంచి విషయం అయినప్పటికీ.. పత్తి అందుబాటులో లేని సమయంలో ఇంత రావడం రైతులకు కొంత నిరాశ కలిగించే విషయం.
Similar News
News March 8, 2026
అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్

AP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ ఆమెను ఇటీవల ఈ కేసులో ఏ2గా చేర్చింది. ఈ మేరకు రాజమండ్రి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా విచారణ చేపట్టింది. తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.
News March 8, 2026
రాష్ట్రపతి ఘటన: మమత సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్

బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రపతి <<19322594>>ద్రౌపదీ ముర్ము<<>> పట్ల వ్యవహరించిన తీరు దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సంతాళీ తెగ సమ్మేళనాన్ని ఉద్దేశపూర్వకంగానే ఆ జనాభా తక్కువ ఉన్న చోట నిర్వహించడం, కనీస ప్రొటోకాల్ పాటించకుండా CM మమతా బెనర్జీ గైర్హాజరు కావడం గిరిజన జాతులను అవమానించడమేనని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారిని రాజకీయాల్లోకి లాగడం ఏమాత్రం సరికాదని ధ్వజమెత్తారు.
News March 8, 2026
వాల్మికిపురం: స్కూటర్ ఢీకొని తల్లి మృతి.. బిడ్డకు సీరియస్

స్కూటర్ ఢీకొని తల్లి మృతి చెందడంతో ఆమె కుమారుడు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. శనివారం రాత్రి వాల్మీకిపురం మండలంలో జరిగిన ఘటనపై ఎస్సై తిప్పేస్వామి వివరించారు. గుర్రంకొండ మండలం రామాపురంకి చెందిన మురళి భార్య రెడ్డిలక్ష్మి ఆమె కుమారుడు బాలాజీ బైకులో సొంతపనిపై చింతపర్తికి వచ్చారు. పనిముగించుకుని తిరిగి స్వగ్రామానికి బైకులో వెళుతుండగా.. వాల్మీకిపురం బైపాస్‌లో స్కూటర్ ఢీకొని తల్లి మృతి చెందింది.


