News April 1, 2024

అందుకోసం గర్ల్‌ఫ్రెండ్‌ని ప్రయోగించేవాళ్లు: బాలీవుడ్ నటి

image

బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1990లలో నటీనటుల మధ్య పోటీ ఎక్కువగా ఉండేదని అన్నారు. కెరీర్ పట్ల అభద్రతా భావంతో ఉన్నవారు ఇతరుల సక్సెస్‌ను ఓర్వలేకపోయేవారని చెప్పారు. వారిని కిందికి లాగేందుకు అవసరమైతే బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్‌ని ప్రయోగించేవాళ్లని తెలిపారు. ఇలాంటి పరిస్థితితో తాను ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. సినిమాల నుంచి ఎవరినీ తీసెయ్యాలని తాను ప్రయత్నించలేదన్నారు.

Similar News

News March 18, 2026

మొజ్తబాను వెతికి పట్టుకుని చంపేస్తాం: ఇజ్రాయెల్

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని వెతికి పట్టుకుని చంపేస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరించింది. ‘ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించే ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవడాన్ని కొనసాగిస్తాం. మా దేశానికి వ్యతిరేకంగా చేయి ఎత్తిన వారు మా నుంచి <<19410383>>తప్పించుకోలేరు<<>>. వారిని వెంబడిస్తాం. కనుగొంటాం. హతమారుస్తాం’ అని IDF ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ స్పష్టంచేశారు. అయితే మొజ్తబా ఆచూకీపై తమ వద్ద సమాచారం లేదని చెప్పారు.

News March 18, 2026

రేణు దేశాయ్‌పై అసభ్య పోస్టులు.. ఇద్దరి అరెస్ట్

image

నటి రేణు దేశాయ్‌పై సోషల్ మీడియాలో <<19265289>>అసభ్యకర పోస్టులు<<>> పెట్టిన ఇద్దరు వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అశ్లీల పదజాలంతో వేధిస్తున్నారని ఇటీవల 4 SM అకౌంట్లపై రేణు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరిని పోలీసులు పట్టుకోగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. SMలో వేధించే కేటుగాళ్లను వదిలిపెట్టబోమని పోలీసులు హెచ్చరించారు. బాధితులు తమను సంప్రదించాలని సూచించారు.

News March 18, 2026

మార్చి 18: చరిత్రలో ఈ రోజు

image

*1871: భారత సంతతికి చెందిన గణిత, తర్క శాస్త్రవేత్త అగస్టస్ డీ మోర్గాన్ మరణం
*1922: శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు మహాత్మా గాంధీకి 6 ఏళ్ల జైలు శిక్ష
*1938: బాలీవుడ్ నటుడు శశి కపూర్ జననం
*1965: అంతరిక్షంలో నడిచిన తొలి రోదసీ యాత్రికుడిగా అలెక్సీ లియనోవ్ రికార్డు
*1998: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ పదవీ విరమణ (ఫొటోలో)