News August 20, 2025
విశాఖలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

మంగళగిరి మయూరి టెక్ పార్కు నుంచి వర్చువల్‌గా విశాఖలోని డెక్ భవనంలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను సీఎం నారా చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Similar News
News August 21, 2025
KNR: గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై సీపీ సమీక్ష

రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణపై KNR CP గౌష్ ఆలం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
News August 21, 2025
INTERలో చేరేందుకు మరో అవకాశం : ADB DIEO

ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రవేశాల కోసం మరొకసారి గడువు పొడిగించినట్లు ఆదిలాబాద్ DIEO జాదవ్ గణేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. గుర్తింపు పొందిన కళాశాలల జాబితా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని వెల్లడించారు.
News August 21, 2025
శ్రీకాకుళం జిల్లా పశువైద్యాధికారికి రాష్ట్ర స్థాయి పురస్కారం

మూగజీవాల వైద్య సేవలో విశేష సేవలందించినందుకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన డా. లిఖినేని కిరణ్ కుమార్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పశువైద్యాధికారి పురస్కారం అందుకున్నారు. బుధవారం విజయవాడలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో డైరెక్టర్ దామోదర్ నాయుడు ఆయనకు ఈ అవార్డును శాలువాతో సన్మానించి బహుకరించారు. పశువైద్య రంగంలో చేసిన కృషికి మరింత గుర్తింపు లభిస్తుందని అధికారులు అభినందించారు.