News August 20, 2025
HYD: ట్రంపెన్ జంక్షన్ ప్రారంభోత్సవం వాయిదా

ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానిస్తూ కోకాపేట నియో పోలీస్ వద్ద నిర్మించిన ట్రంపెన్ జంక్షన్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించాల్సిన ఉండగా.. పలు కారణాలతో కార్యక్రమం రద్దైంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఓవర్ మీదుగా 20 నిమిషాల్లోనే కోకాపేటకు చేరుకునేలా సుమారు రూ.80 కోట్లతో జంక్షన్‌ను నిర్మించారు.
Similar News
News March 14, 2026
మెదక్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

మెదక్ జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 68 కేంద్రాల్లో 11,247 మంది విద్యార్థులు (5,577 బాలురు, 5,670 బాలికలు) పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండటంతో పాటు జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
News March 14, 2026
జనసేన ఆవిర్భావ దినోత్సవం.. చంద్రబాబు శుభాకాంక్షలు

AP: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పని చేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు శుభాభినందనలు’ అని ట్వీట్ చేశారు.
News March 14, 2026
సమ్మర్ ఎఫెక్ట్.. HYDలో KG@325

ఎండకాలం ప్రారంభంలోనే చికెన్ ధరలు కొండెక్కాయి. శనివారం KG చికెన్ రూ.325 నుంచి 330 వరకు పలకడం గమనార్హం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కిలో స్కిన్‌తో కూడిన చికెన్ ధర రూ.286గా ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.325కు చేరుకుంది. వేసవి మొదలులో ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ధరలు ఇంకెంత పెరుగుతాయోనని చికెన్ ప్రియులు సందేహ పడుతున్నారు. మీ ఏరియాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.


