News August 20, 2025

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

image

కోనసీమ జిల్లాలో ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరిగే వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్‌లో ఎస్పీ, జాయింట్ కలెక్టర్‌తో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 5, 2026

7న ములుగు రోడ్డులో జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 7న హనుమకొండలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య తెలిపారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18-35 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గలవారు ములుగు రోడ్డులోని ప్రభుత్వ ITI ప్రాంగణంలో ఉన్న ఎంప్లాయిమెంట్ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.

News March 5, 2026

NZB: కొడుకును నరికి చంపాడు!

image

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో దారుణం జరిగింది. గంజాయికి అలవాటు పడి నిత్యం వేధిస్తున్న కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు. నల్లవెల్లికి చెందిన కొత్తగొల్ల భాను ప్రకాశ్(23) మత్తుకు బానిసై డబ్బులు ఇవ్వాలంటూ నిత్యం వేధిస్తూ నిన్న రాత్రి కూడా ఇబ్బంది పెట్టడంతో తండ్రి కిషన్ నరికి చంపాడు. అనంతరం ఇందల్వాయి పొలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.

News March 5, 2026

చిత్తూరులో జాతీయ జెండా ఎగిరి.. 30 రోజులకు పైనే

image

చిత్తూరు జిల్లా కేంద్రంలో మువ్వన్నెల జాతీయ జెండా ఎగిరి ముచ్చటగా 30 రోజులకు పైనే అయింది. నగరంలోని గాంధీ కూడలి వద్ద “ఐ లవ్ చిత్తూరు” పార్కులో భారీ ఎత్తులో జాతీయ జెండా స్తంభం ఏర్పాటుచేసి అందులో జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అధికారులు జెండాను ఘనంగా ఆవిష్కరించిన అనంతరం దాదాపు జాతీయ జెండా ఎగరలేదు. స్తంభం మాత్రమే దర్శనమిస్తోంది. మన జాతీయ జెండా ఎగరడానికి దృష్టి పెట్టండి సారూ.!