News April 1, 2024

HYD: భారీగా నగదు కట్టలు సీజ్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జీఆర్పీ, RPF పోలీసులు కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన తనిఖీల్లో రూ.37.50 లక్షల నగదు పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ రామ్ బ్యాగులో నగదు గుర్తించిన పోలీసులు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. ఆదాయ శాఖ అధికారులకు నగదు అప్పజెప్పినట్లు GRP ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.

Similar News

News March 5, 2026

HYDలో ఇక ‘RED’ నోటీసులు

image

ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ ఇప్పుడు ట్యాక్స్ బాకీదార్లపై కన్నెర్ర చేస్తోంది. ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో ‘రెడ్ నోటీసుల’ పర్వం మొదలైంది. గడువు దాటితే సెక్షన్ 269 ప్రయోగించి ఆస్తుల జప్తుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే వెయ్యి కోట్ల బకాయి ఉండటం. ఈ నిధులు రాకపోతే వరద నివారణ, రోడ్ల మరమ్మతు పనులు గంగలో కలవడం ఖాయమనే విమర్శలొస్తున్నాయి.

News March 5, 2026

నాగోల్: CM రేవంత్‌కు KTR వార్నింగ్

image

CM రేవంత్ ఇల్లు రెడ్డి కుంటలో ఉందని KTR అన్నారు. నాగోల్ STP పరిశీలన అనంతరం ఆయన ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. CM సోదరుడి ఇల్లు కూడా దుర్గం చెరువులో ఉందని, మంత్రుల ఇండ్లు కూడా చెరువుల మధ్యలో ఉన్నాయని ఆరోపించారు. వాటిని కూల్చే దమ్ము ఎవరికీ లేదన్నారు. అదే పేదవాడి భూమికి రిజిస్ట్రేషన్లు ఉన్నా కూల్చివేస్తున్నారని.. కానీ, పేదలు కుర్చి మడతపెట్టి కొట్టే రోజులు వస్తాయని CMకు KTR వార్నింగ్ ఇచ్చారు.

News March 5, 2026

HYDలో వరుస ప్రమాదాలు.. జాగ్రత్త!

image

సిటీలో వరుసగా సంభవిస్తున్న ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. గత 2 నెలల్లో పదుల సంఖ్యలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం పట్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. బాచుపల్లి ఘటన మరవక ముందే కాటేదాన్‌లో ఉదయం మంటలు చెలరేగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున అగ్నిప్రమాదాలకు అవకాశం ఉందని హైడ్రా, అగ్నిమాపక బృందాలు హెచ్చరిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ పాటించాలని సూచిస్తున్నాయి.