News August 20, 2025
తిరుపతి: ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

తిరుపతి విమానాశ్రయ రోడ్డులోని IIDT భవనంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశారు. దీనిని సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. విద్యార్థులు, స్టార్టప్స్, వ్యాపారవేత్తలకు నూతన అవకాశాలు కలిగించేందుకు ఈ హబ్ దోహదపడుతుందని చెప్పారు.
Similar News
News August 20, 2025
ADB: ‘బీఎస్పీతోనే బహుజన రాజ్యాధికారం’

బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పేర్కొన్నారు. ఇచ్చోడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలకు 43% రిజర్వేషన్ అమలు చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీ రాజ్యాంగ రద్దు కోసం కుట్ర చేస్తుందన్నారు. నాయకులు జంగుబాపు, సతీష్ తదితరులున్నారు.
News August 20, 2025
ADB: ‘CCI పరిశ్రమను పునరుద్ధరించాలని వినతి’

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడెం నగేష్ ఢిల్లీలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో సీసీఐని పునరుద్ధరించాలని విన్నవించారు. ఈ మేరకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు MP నగేష్ పేర్కొన్నారు. అనంతరం తెలంగాణలోని తాజా రాజకీయ అంశాలను కేంద్ర మంత్రితో చర్చించినట్లు వెల్లడించారు.
News August 20, 2025
భీమవరం: వినాయక చవితి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

వినాయక చవితి ఉత్సవాలను పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలు నిషేధించామని, ఊరేగింపులో డీజే సౌండ్ సిస్టం వినియోగించరాదన్నారు.