News August 20, 2025

ఢిల్లీ సీఎంపై దాడికి కారణమిదేనా?

image

ఢిల్లీ CM రేఖా గుప్తాపై రాజేశ్ <<17460103>>దాడికి<<>> పాల్పడిన సంగతి తెలిసిందే. గుజరాత్‌కు చెందిన నిందితుడు శునక ప్రేమికుడని, సుప్రీంకోర్టు <<17368812>>తీర్పుతో<<>> కలత చెంది ఢిల్లీకి వెళ్లాడని అతడి తల్లి పేర్కొంది. ఇదే విషయమై CMను ప్రశ్నించేందుకు వెళ్లి దాడి చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిది హింసా ప్రవృత్తి అని, మానసిక పరిస్థితి బాగాలేదని అతడి తల్లి తెలిపారు. తనతో సహా పొరుగువారినీ కొట్టేవాడని వివరించారు.

Similar News

News August 21, 2025

రాత్రి కాఫీ తాగితే ఇంత ప్రమాదమా?

image

రాత్రులు కాఫీ తాగితే ఎంతో ప్రమాదమని టెక్సస్ యూనివర్సిటీ <>రీసెర్చర్స్ స్టడీ <<>>పేర్కొంది. వారి అధ్యయనం ప్రకారం రాత్రులు కాఫీ తాగితే నిద్ర పాడవడమే కాకుండా.. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఆవేశపూరిత, నిర్లక్ష్యపు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది. డ్రోసోఫిలా మెలనోగ్యాస్టర్ అనే ఈగ జాతిపై పరిశోధనలు చేశారు. రాత్రులు కెఫిన్ ఇచ్చిన ఈగల ప్రవర్తన వింతగా, నిర్లక్ష్యంగా ఉందని తెలిపారు.

News August 21, 2025

ఏది ఏమైనా టిడ్కో ఇళ్లు కట్టిస్తాం: నారాయణ

image

AP: లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లో టిడ్కో ఇళ్లు అందజేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ‘గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల గందరగోళం అయ్యింది. పెండింగ్ బిల్స్ రూ.3,664 కోట్లు, కాంట్రిబ్యూషన్ రిటర్న్‌కి రూ.370కోట్లు, ఇళ్లు కట్టడానికి రూ.2,100 కోట్లు కావాలి. 83,072 ఇళ్లు రెడీగా ఉన్నాయి. సంక్రాంతికి మరో లక్ష ఇళ్లు, మిగిలినవి వచ్చే మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని CM ఆదేశించారు’ అని తెలిపారు.

News August 20, 2025

పేదలకు ఇళ్లు.. స్థలాలు గుర్తించాలని సీఎం ఆదేశాలు

image

AP: వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు. గృహ నిర్మాణ శాఖ సంబంధిత అంశాలపై సచివాలయంలో సమీక్షించారు. మరో 3 నెలల్లో 3 లక్షల ఇళ్లు, సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్లు పూర్తి కావాలని ఆదేశించారు. పట్టణ పేదలకు 2 సెంట్లు, గ్రామీణ పేదలకు 3 సెంట్లు భూమి కేటాయిస్తామన్న హామీ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలని సూచించారు.