News August 20, 2025
వైరా రిజర్వాయర్‌ను పరిశీలించిన కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వైరాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మత్స్య విత్తన అభివృద్ధి శాఖ కార్యాలయం, వైరా రిజర్వాయర్‌లను పరిశీలించారు. ఆయన రిజర్వాయర్ నీటిమట్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేపల పెంపకం, దిగుబడిపై మత్స్య శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం కలెక్టర్ వర్షాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News August 20, 2025
ఖమ్మం: రేపటి నుంచి ‘పనుల జాతర–2025’: కలెక్టర్

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లాలో పూర్తి అయిన పనులకు ప్రారంభోత్సవం, కొత్త పనులకు భూమి పూజ కార్యక్రమాలను రేపటి నుంచి పెద్ద ఎత్తున ‘పనుల జాతర -2025’ను నిర్వహిస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 571 గ్రామాల్లో ఉపాధి హామీ పథకం, ఆర్‌డబ్ల్యూఎస్,పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్&బీ విభాగాల పరిధిలో ప్రారంభోత్సవాలు, భూమి పూజలు నిర్వహించనున్నారు.
News August 20, 2025
ఖమ్మం: వీధి కుక్కల బెడద.. ప్రజల బెంబేలు

నేలకొండపల్లి మండలంలో వీధి కుక్కల బెడద తీవ్రమైందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చెరువు మాదారం, పైనంపల్లి, బుద్ధారం గ్రామాల్లో కుక్కలు పశువులపై, మనుషులపై దాడులకు దిగుతున్నాయని చెబుతున్నారు. ఈ నెలలో కేవలం 20 రోజుల వ్యవధిలోనే 60కి పైగా కుక్కకాటు కేసులు నమోదయ్యాయని సమాచారం. అధికారులు ఇప్పటికైనా స్పందించి, కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
News August 20, 2025
రైతులకు షరతులు పెడుతున్న దుకాణాలపై కేసులు: ఖమ్మం CP

యూరియా అవసరాన్ని ఆసరాగా చేసుకొని రైతులకు షరతులు పెడుతున్న 5 ఎరువుల దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారని ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. బుధవారం నేలకొండపల్లి, చింతకాని, రఘునాథపాలెం, సత్తుపల్లి మండలాల్లోని ఎరువుల దుకాణాలలో పోలీసులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారని చెప్పారు. రైతులు సైతం యూరియా కొనుగోలు సమయంలో దుకాణదారులు ఏమైనా షరతులు పెడితే సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.