News August 20, 2025

రైతు సమస్యలపై ప్రశ్నించిన ఎంపీ కావ్య

image

పంట బీమా చెల్లింపుల్లో ఆలస్యం, రైతుల సమస్యలపై ఎంపీ కడియం కావ్య పార్లమెంటులో ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ మొదలవుతున్న తరుణంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయని, ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతు సంక్షేమానికి కృషి చేయాలని ఎంపీ అన్నారు.

Similar News

News March 18, 2026

పెద్దపల్లి: 9 మంది విద్యార్థులు గైర్హాజరు

image

పెద్దపల్లి జిల్లాలో పదవ తరగతి రెండవ రోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి.శారద తెలిపారు. మొత్తం 7,489 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 7,480 మంది హాజరయ్యారు. 9 మంది గైర్హాజరయ్యారు. దీంతో 99.9 శాతం హాజరు నమోదైంది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.

News March 18, 2026

ఇంద్రకీలాద్రిపై వైభవంగా చండీ హోమం

image

అమావాస్య పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో చండీ హోమం వైభవంగా జరిగింది. కొండపై నూతనంగా నిర్మించిన యాగశాల భక్తుల విశేష ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో దాదాపు 372 మంది భక్తులు (186 జంటలు) హోమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పకడ్బందీగా ముందస్తు చర్యలు చేపట్టారు.

News March 18, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,530
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ. 14,288
*వెండి 10 గ్రాముల ధర రూ.2,575