News August 20, 2025
నేనిప్పుడే రిటైర్ అవ్వను: నాగవంశీ

‘వార్-2’ సినిమాతో భారీ నష్టం వాటిల్లిందని, అందుకే సినిమాలు ఆపేసి నిర్మాత దుబాయ్‌కి వెళ్లిపోతున్నారంటూ వచ్చిన వార్తలను నాగవంశీ ఖండించారు. ఆ టైం ఇంకా రాలేదని, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు సారీ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తాను రిటైర్ అయ్యేందుకు ఇంకా 10-15 ఏళ్లు పడుతుందని చెప్పారు. ఆల్ వేస్ ఫర్ సినిమాస్ అంటూ రాసుకొచ్చారు. తర్వాత సినిమా ‘మాస్ జాతర’తో మళ్లీ మీ ముందుకు వస్తానని పేర్కొన్నారు.
Similar News
News March 21, 2026
ఇరాన్ ప్రెసిడెంట్‌కు మోదీ ఈద్ శుభాకాంక్షలు

తాను ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు PM మోదీ ట్వీట్ చేశారు. ‘ఆయనకు ఈద్ శుభాకాంక్షలు చెప్పాను. ఈ పండుగ వెస్ట్ ఆసియాలో శాంతి, స్థిరత్వం తీసుకొస్తుందని ఆశించాం. అక్కడి కీలక ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దాడులను ఖండించాను. దీనివల్ల ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతిని గ్లోబల్ సప్లై చైన్‌కు అంతరాయం కలుగుతుంది. ఇరాన్‌లోని భారతీయుల భద్రతకు మద్దతిచ్చినందుకు అభినందించాను’ అని తెలిపారు.
News March 21, 2026
గర్భిణికి వర్క్ ఫ్రమ్ హోమ్ నిరాకరణ.. రూ.211 కోట్ల జరిమానా

హై రిస్క్ ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళకు వర్క్ ఫ్రమ్ హోమ్ నిరాకరించిన కంపెనీకి ఒహాయో జ్యూరీ(US) భారీ జరిమానా విధించింది. తప్పని పరిస్థితుల్లో ఆమె ఆఫీసుకు వెళ్లడంతో నెలలు నిండకుండానే జన్మనిచ్చారు. దీంతో కొన్ని గంటల్లోనే బిడ్డ మరణించింది. ఇందుకు కంపెనీనే కారణమని తేల్చిన జ్యూరీ ఆ కుటుంబానికి $22.5 మిలియన్లు(రూ.211.52 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. దీనిపై సంస్థ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
News March 21, 2026
పొలిటికల్ హీట్.. సొంతగూటిలో సైలెన్స్!

‘ధురంధర్-2’ రిలీజ్‌తో ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఈ మూవీపై తెలుగు హీరోలు సహా పలువురు దక్షిణాది స్టార్లు ప్రశంసలు కురిపిస్తే పుట్టిల్లు అయిన బాలీవుడ్‌లో మాత్రం సైలెన్స్ వెంటాడుతోంది. సరైన హిట్లు లేక కరవులో ఉన్న బాలీవుడ్ ఈ హిట్‌ను సెలబ్రేట్ చేసుకోకపోవడంతో అక్కడి గ్రూప్ పాలిటిక్స్ మరోసారి చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు ఇది ప్రొపగండా మూవీ అంటూ <<19436529>>రాజకీయ<<>> విమర్శలను ఎదుర్కొంటోంది.


