News August 20, 2025
మలేరియాకు మూలాన్ని కనిపెట్టింది సికింద్రాబాద్‌లోనే

సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో పని చేసే బ్రిటిష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ 1997 ఆగస్టు 20న మలేరియా వ్యాప్తికి దోమలే కారణమని నిరూపించారు. పరిశోధనతో ఆయనను 1902లో నోబెల్ అవార్డు వరించింది. దానికి గుర్తుగా ఈ రోజును ప్రపంచ దోమల దినోత్సవం జరుపుతారు. నేటికి ఈ ఆస్పత్రిలో డెంగ్యూ, మలేరియా వ్యాధులపై అవగాహన సదస్సులను నిర్వహిస్తూ చరిత్రను నెమరేసుకుంటున్నారు.
Similar News
News March 13, 2026
‘రామాయణంలో పిడకల వేట’ అంటే?

ముఖ్య విషయాన్ని వదిలేసి పనికిరాని వాటి గురించి మాట్లాడే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. పండితులు రామాయణం చెబుతుండగా ఓ మహిళ ఇంటి దగ్గర పిడకలు ఏమయ్యాయోనని మధ్యలో అనడంతో ‘రామాయణంలో పిడకల వేట’ వాడుకలోకి వచ్చింది. అలాగే రామాయణంలో ‘త్రిపిటికా:’ అని ఉంది. బౌద్ధ గ్రంథాలనూ ‘త్రిపిటికా’ అంటారు. దీంతో బౌద్ధం తర్వాత రామాయణం వచ్చిందని వాదించే వాళ్ల గురించి చెబుతూ ఈ జాతీయం వచ్చిందని నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 13, 2026
వనపర్తి: ‘సాగు, తాగునీటికి ఇబ్బంది కలగనివ్వద్దు’

వనపర్తి జిల్లాలో సాగు, తాగునీటితో పాటు విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పంటలు చేతికి వచ్చే వరకు రైతులకు ఇబ్బంది కలగనివ్వద్దన్నారు. అలాగే జిల్లాలో LPG సిలిండర్ల కొరత లేదని, ఆసుపత్రులు, పాఠశాలలకు నిరంతరం సరఫరా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.
News March 13, 2026
సీఎం ను కదిలించిన ఏలూరు కలెక్టర్

పాపికొండల అభయారణ్య పరిధిలోని గిరిజన గ్రామాల్లో బోరుబావులు, రహదారుల నిర్మాణానికి అటవీ అధికారులు అభ్యంతరం చెబుతున్నారని కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ వెట్రిసెల్వి సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. స్పందించిన సీఎం గిరిజనులకు కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, అటవీ అధికారులు కొంత వెసులుబాటు ఇవ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో గిరిజనులకు మౌలిక సదుపాయాలు అందేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.


