News April 1, 2024
అల్లుఅర్జున్-అట్లీ సినిమాలో సమంత?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమా షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభం కానుందట. ఈ మూవీలో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సామ్ గతంలో అట్లీతో ‘తేరి’, బన్నీతో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలు చేశారు. పుష్పలో ఐటమ్ సాంగ్‌లో కనిపించారు.
Similar News
News January 29, 2026
మరింత పెరగనున్న చలి

APలోని కోస్తా, రాయలసీమలో చలి మరింత పెరుగుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-2 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. ఇవాళ మన్యం, అల్లూరి, ఏలూరు, ప.గో, ఎన్టీఆర్, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని వెల్లడించింది. అటు TGలోనూ పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. FEB 2 వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.
News January 29, 2026
RO-KO కోసం రూల్స్ మారనున్నాయ్!

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ ఆడిన మ్యాచులు ప్రసారం కాకపోవడంపై విమర్శలు వచ్చాయి. అవి లైవ్ టెలికాస్ట్ కాకపోవడానికి కారణం 100 దేశవాళీ మ్యాచులు మాత్రమే లైవ్ చేసేలా టెలివిజన్ సంస్థతో BCCIకి ఒప్పందం ఉంది. ఇప్పుడు దాన్నే మార్చనున్నట్లు, 100కు మించి మ్యాచులు ప్రసారం చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. స్టార్ ప్లేయర్స్ ఆడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు.
News January 29, 2026
ఉపవాసంలో ఏయే పదార్థాలు తీసుకోవచ్చు?

ఏకాదశి ఉపవాసంలో ధాన్యాలకు(బియ్యం, గోధుమలు) దూరం ఉండాలి. పాలు, పెరుగు, వెన్న వంటి పాడి పదార్థాలు కొద్దిమేర తీసుకోవచ్చు. అన్ని రకాల పండ్లు కూడా తినవచ్చు. జ్యూస్ చేసుకుంటే మాత్రం చక్కెరకు దూరం ఉండటం మంచిది. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. సాధారణ ఉప్పు వాడకూడదట. బదులుగా సైంధవ లవణం వాడాలని పండితులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు నీరు ఎక్కువగా తాగుతుండాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు సగ్గుబియ్యం తినొచ్చు.


