News August 20, 2025
మలేరియాకు మూలాన్ని కనిపెట్టింది సికింద్రాబాద్‌లోనే

సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో పని చేసే బ్రిటిష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ 1997 ఆగస్టు 20న మలేరియా వ్యాప్తికి దోమలే కారణమని నిరూపించారు. పరిశోధనతో ఆయనను 1902లో నోబెల్ అవార్డు వరించింది. దానికి గుర్తుగా ఈ రోజును ప్రపంచ దోమల దినోత్సవం జరుపుతారు. నేటికి ఈ ఆస్పత్రిలో డెంగ్యూ, మలేరియా వ్యాధులపై అవగాహన సదస్సులను నిర్వహిస్తూ చరిత్రను నెమరేసుకుంటున్నారు.
Similar News
News August 20, 2025
HYD: సీబీఐకి చిక్కిన NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్

HYD నేషనల్ హైవేస్ అథారిటీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్‌ను CBI అధికారులు అరెస్ట్ చేశారు. బీబీనగర్ టోల్ ప్లాజా పక్కన రెస్టారెంట్ నిర్వహిస్తున్న యజమాని నుంచి ₹.60 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. హైవే పక్కన రెస్టారెంట్ నడుపుతున్నందుకు ₹.లక్ష డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. HYD,WGL, సదాశివపేటలోని దుర్గాప్రసాద్ ఇళ్లు, ఆఫీసుల్లో CBI అధికారులు సోదాలు నిర్వహించారు.
News August 20, 2025
చందానగర్: ఖజానా జ్యువెలర్స్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

చందానగర్ ఖజానా జ్యువెలర్స్ దొంగతనం కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అంతర్రాష్ట్ర గ్యాంగ్‌కు చెందిన అనీశ్ కుమార్ సింగ్, ప్రిన్స్ కుమార్ రజాక్‌లను అరెస్ట్ చేశారు. పూణేలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక పిస్టల్, 1015 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్‌లో మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News August 20, 2025
కూకట్‌పల్లిలో 7.8 ఎకరాలకు రూ.547 కోట్లు

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని 7.8 ఎకరాల భూములు ఈ-వేలం ద్వారా రూ.547 కోట్లకు అమ్ముడుపోయాయి. ఎకరాకు రూ.70 కోట్లు చెల్లించి గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈ భూములను సొంతం చేసుకుంది. అరబిందో, ప్రెస్టీజ్, అశోక బిల్డర్స్ వంటి సంస్థలు పోటీ పడ్డాయి. వేలంలో గోద్రేజ్ అధిక ధర పలికి భూములను దక్కించుకుంది. ఈ ఆదాయాన్ని పేద, మధ్యతరగతి వర్గాల గృహ నిర్మాణ పథకాలకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.