News August 20, 2025

వాస్తు పేరుతో ఇంద్రకీలాద్రిలో కోట్లు స్వాహా?

image

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. సుమారు 2-3 లక్షల మంది వస్తారు. ప్రసాద భవనం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఓ ఇంజినీరింగ్ అధికారి, ఆలయ ఆస్థాన విధ్వాంసుడి నిర్వాకం వల్ల శాశ్వత భవనాలు నిర్మించలేదని ఆరోపణలున్నాయి. నిర్మాణాలు చేపట్టి వాస్తు దోషం పేరిట కూల్చివేయడం వల్ల కోట్లు దండుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Similar News

News August 21, 2025

తూప్రాన్: 4 నెలల క్రితం భర్త మృతి.. భార్య సూసైడ్

image

భర్త మరణంతో కుటుంబ పోషణ భారమై భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తూప్రాన్ ఎస్ఐ శివానందం తెలిపారు. తూప్రాన్‌కు చెందిన గజ్జల బాబుకు సంధ్యతో వివాహం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో 4 నెలల క్రితం బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. బాబు మరణంతో భార్య సంధ్య(34)కు కుటుంబ పోషణ భారమైంది. ఈ క్రమంలో 13న ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

News August 21, 2025

శ్రీశైలం ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్

image

AP: శ్రీశైలం ఫారెస్ట్ అధికారులపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఘటనపై సవివరంగా నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు. ‘తాము తప్పు చేసినా ఉపేక్షించొద్దని చంద్రబాబు, నేను అసెంబ్లీలో స్పష్టం చేశాం. ప్రజా జీవితంలో ఉన్నవారు తమను తాము నియంత్రించుకోవాలి. ఉద్యోగుల విధి నిర్వహణను ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించొద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు.

News August 21, 2025

కొత్తగూడెం: ‘మార్వాడీలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు’

image

కొత్తగూడెంలో బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడారు. తెలంగాణలో మార్వాడీలు ఏకమై స్థానిక వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారం కోసం వచ్చిన మార్వాడీలు రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని, ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారన్నారు. పలు చోట్ల ఉన్న ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదం నేడు కొత్తగూడెంకు పాకడం గమనార్హం.