News August 20, 2025
SRD: ఐఐటీ హైదారాబాద్‌లో పీహెచ్‌డీ అడ్మిషన్లకు ఆహ్వానం

కందిలోని ఐఐటీ హైదారాబాద్‌లో కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగంలో ప్రత్యేక రౌండ్ పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి స్పాన్సర్ చేసిన ప్రాజెక్టుల ద్వారా నిధులు సమకూరుతాయన్నారు. ఆసక్తి గలవారు సెప్టెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు cse.iith.ac.in/admissions/phd లింకులో చూడాలని కోరారు.
-SHARE IT
Similar News
News August 21, 2025
తూప్రాన్: 4 నెలల క్రితం భర్త మృతి.. భార్య సూసైడ్

భర్త మరణంతో కుటుంబ పోషణ భారమై భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తూప్రాన్ ఎస్ఐ శివానందం తెలిపారు. తూప్రాన్‌కు చెందిన గజ్జల బాబుకు సంధ్యతో వివాహం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో 4 నెలల క్రితం బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. బాబు మరణంతో భార్య సంధ్య(34)కు కుటుంబ పోషణ భారమైంది. ఈ క్రమంలో 13న ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
News August 21, 2025
శ్రీశైలం ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్

AP: శ్రీశైలం ఫారెస్ట్ అధికారులపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఘటనపై సవివరంగా నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు. ‘తాము తప్పు చేసినా ఉపేక్షించొద్దని చంద్రబాబు, నేను అసెంబ్లీలో స్పష్టం చేశాం. ప్రజా జీవితంలో ఉన్నవారు తమను తాము నియంత్రించుకోవాలి. ఉద్యోగుల విధి నిర్వహణను ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించొద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు.
News August 21, 2025
కొత్తగూడెం: ‘మార్వాడీలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు’

కొత్తగూడెంలో బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడారు. తెలంగాణలో మార్వాడీలు ఏకమై స్థానిక వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారం కోసం వచ్చిన మార్వాడీలు రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని, ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారన్నారు. పలు చోట్ల ఉన్న ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదం నేడు కొత్తగూడెంకు పాకడం గమనార్హం.