News August 20, 2025
నాగర్‌కర్నూల్: ‘గణేష్ మండపాలకు దరఖాస్తు చేసుకోవాలి’

నాగర్‌కర్నూల్ జిల్లాలో గణేష్ మండపాలు ఏర్పాటు చేయాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. policeportal.tspolice.gov.in పోర్టల్‌లో కమిటీ, మండపం వివరాలు, ఫోన్ నంబరు వంటి సమాచారం తప్పనిసరిగా నమోదు చేయాలని ఆయన సూచించారు. ప్రమాదాల నివారణకు ఈ జాగ్రత్తలు అవశ్యమని పేర్కొన్నారు.
Similar News
News March 18, 2026
21 కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం

దివ్యాంగ శక్తి కింద 21 కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కడప ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ పూల నాగరాజు అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. కడప ఆర్టీసీ రీజనల్ పరిధిలో 18,790 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. వాటికోసం రూ.18 లక్షల 79 వేల నిధులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. గతంలో 4 రకాల వైకల్యాలు ఉన్న దివ్యాంగులకు మాత్రమే రాయితీలు ఉండేవన్నారు.
News March 18, 2026
RR: వారికి డబుల్ బెడ్ రూమ్ రద్దు చేయండి: కలెక్టర్

లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్రూంలో నివసించకుంటే నోటీస్ ఇచ్చి రద్దు చేయాలని RR కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో హౌసింగ్ బోర్డు అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, మిషన్ భగీరథ అధికారులు, విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 31లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు.
News March 18, 2026
రైలు నుంచి జారిపడి మణుగూరు వ్యక్తి మృతి

వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఇంటికన్నె-నెక్కొండ మధ్య రైలు నుంచి జారిపడి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన పెంటయ్య(48) మృతి చెందారు. గుర్తుతెలియని రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయారు. మృతుని సెల్ ఫోన్ సిమ్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు జీఆర్పీ సీఐ సురేందర్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోదరుడు మోహన్రావుకు అప్పగించారు.


