News August 20, 2025

BHPL: గోదావరి వరద ఉధృతి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

image

భూపాలపల్లి జిల్లాలో గోదావరి నది నీటిమట్టం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామన్నారు. బుధవారం కలెక్టర్‌, ఎస్పీ కిరణ్‌ ఖరేతో కలిసి కాళేశ్వరంలోని గోదావరి, సరస్వతి ఘాట్ల వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. ప్రజల ప్రాణాలను రక్షించే విషయంలో యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 15, 2026

కడప: 10th పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు

image

కడప జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న 10th పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుందన్నారు. ఇన్విజిలేటర్లు పరీక్షా విధులకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరులు ఉండరాదన్నారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలన్నారు.

News March 15, 2026

నిమ్మనపల్లె: ‘అతని చదువుకు పేదరికం తలవంచింది’

image

ఏడాది వయసులో తల్లితండ్రులను కోల్పోయి అక్క, మేనమామ ఇంట్లో పెరిగాడు. బాల్యం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివాడు. ఉన్నత చదువులకు పేదరికం అడ్డొచ్చినా.. వెనకడుగు వేయలేదు. కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహం, అతని సంకల్పం ముందు పేదరికం తలవచింది. UPSC సివిల్ సర్వీసెస్-2025 ఫలితాల్లో అన్నమయ్య (D) నిమ్మనపల్లె (M) అగ్రహారానికి చెందిన గోగుల రాజశేఖర్ 920వ ర్యాంకు సాధించాడు.

News March 15, 2026

యుద్ధం.. మరో జలసంధి క్లోజ్?

image

ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ‘బాబ్ ఎల్-మండేబ్’ జలసంధిని హౌతీలు మూసివేసే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే హార్ముజ్ మూతపడటంతో గ్యాస్, చమురు సరఫరా అస్తవ్యస్తమైంది. ఇప్పుడు ఈ మార్గం కూడా క్లోజ్ అయితే 30% గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం పడుతుంది. యూరప్ నుంచి సూయెజ్ కెనాల్ మీదుగా ఇండియా సహా ఆసియాకు వచ్చే నౌకలన్నీ నిలిచిపోతాయి. ఫలితంగా ఇంధన, వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.