News August 20, 2025
చిగురుమామిడి: పాముకాటుకు గురై వ్యక్తి మృతి

పాముకాటుకు గురై రైతు మృతిచెందిన ఘటన బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. సుందరగిరికి చెందిన మెడబోయిన రమేష్ (40) ఈరోజు ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. గ్రామస్థులు గమనించి వెంటనే హుస్నాబాద్‌కు తరలించారు. చికిత్స పొందతూ మృతిచెందాడు.
నిరుపేద రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారుల కమిటీ మండల అధ్యక్షుడు రాజకుమార్ కోరారు.
Similar News
News March 18, 2026
విషాదం.. టెన్త్ విద్యార్థిని సూసైడ్!

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కంబదూరులోని గుండ్లపల్లి కాలనీలో చోటుచేసుకుంది. మైథిలిని చదువు విషయంలో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఐరన్ టాబ్లెట్లు మింగింది. కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లగా మంగళవారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందినట్లు ఎస్ఐ లోకేశ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 18, 2026
SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషనే ఎందుకు?

SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉన్నప్పటికీ ప్రస్తుత ఫామ్, నాయకత్వ లక్షణాల వల్లే అతడి వైపు ఫ్రాంచైజీ మొగ్గు చూపిందని సమాచారం. ఝార్ఖండ్ జట్టుకు తొలిసారి SMAT ట్రోఫీ అందించడంతోపాటు అద్భుత ఆటతో భారత జట్టులోకి ఇషాన్ రీఎంట్రీ ఇచ్చారు. దీంతో బ్యాటింగ్‌లో తడబడుతున్న అభిషేక్‌తో పోలిస్తే ఇషాన్‌ను SRH ఫస్ట్ ఛాయిస్‌గా చూసినట్లు టాక్. మీరేమంటారు?
News March 18, 2026
సిద్దిపేట: ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని షెడ్యూల్ కులాల అభ్యర్థులు స్వయం ఉపాధి పొందేందుకు ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక 2025-26 కింద రాయితీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయ భార్గవ కోరారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన వారైతే రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండి, 21 నుంచి 50 సంవత్సరాలు కలిగి ఉన్నవారు అర్హులన్నారు. ఈనెల 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


