News August 20, 2025
అర్కండ్ల: పొలంలో మహిళకు పాముకాటు.. ఆసుపత్రికి తరలింపు

శంకరపట్నం మం. ఆర్కండ్లకు చెందిన చెర్ల రేణుక వ్యవసాయ పనులకు వెళ్లినప్పుడు పాముకాటుకు గురయ్యారు. గమనించిన తోటి రైతులు వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆమెను ద్విచక్రవాహనంపై కేశవపట్నం వైపు తరలిస్తుండగా, మార్గమధ్యంలో మక్త గ్రామం వద్ద 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి, పైలట్ గోపికృష్ణ ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను KNRలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News August 21, 2025
రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దు: కలెక్టర్

పుట్టపర్తి కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని, అవసరమైన యూరియా సరఫరా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం 4,700 టన్నులు యూరియా ఉందన్నారు. యూరియాను సంబంధిత అధికారులు అవసరాలకు కాకుండా పారిశ్రామిక మళ్లించినా, ఎరువుల డీలర్లు కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
News August 21, 2025
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలి: జేసీ

నంద్యాల జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటి సమావేశం నిర్వహించారు. దళితులకు ఎక్కడా అన్యాయం చోటు చేసుకోకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
News August 21, 2025
గండికోట: లై డిటెక్టర్ టెస్ట్‌కు బాలిక కుటుంబసభ్యులు?

జూలై 14న గండికోటలో బాలిక హత్య కేసు మిస్టరీగా మారింది. డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో కేసు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే బాలిక తల్లిదండ్రులతో పాటు దాదాపు 400 మందిని విచారించారు. కాగా ఈ నెల 26న లై డిటెక్టర్ టెస్ట్ కోసం జమ్మలమడుగు కోర్టుకు రావాలని బుధవారం సాయంత్రం బాలిక కుటుంబసభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.