News August 20, 2025
విద్యుత్ కోతలు లేకుండా చూడాలి: కలెక్టర్

కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున, సిబ్బంది ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ పనులు సాగుతున్న గ్రామాలలో వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు.
Similar News
News March 12, 2026
మార్కాపురంలో కొత్తగా రూర్బన్ పంచాయతీలు

పంచాయతీ జనాభా వార్షిక ఆదాయం, భౌగోళిక స్వరూపం ఆధారంగా ప్రభుత్వం విభజన చేపట్టింది. ఇప్పటివరకు ఐదు గ్రేడులుగా ఉండగా వాటిని నాలుగు గ్రేడులుగా కుదించింది. కొత్తగా రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు చేశారు. మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీలు ఉండగా వాటిలో 8 రూర్బన్, 63 గ్రేడ్-1, 108 గ్రేడ్-2, 227 గ్రేడ్-3 పంచాయతీలుగా విభజించారు. రూర్బన్ పంచాయతీలకు గెజిట్ అధికారిని కార్యదర్శిగా నియమించనున్నారు.
News March 12, 2026
పొదిలి: వామ్మో.. ఇలానూ మోసం చేస్తారా..?

పొదిలిలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఇదే సమయంలో ఓ రెస్టారెంట్ నిర్వాహకుడికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ‘మీకు లైసెన్స్ లేదు. తనిఖీలు చేయకుండా ఉండాలంటే రూ.60వేలు ఇవ్వండి’ అని కోరగా.. భయపడిన నిర్వాహకుడు రూ.6వేలు ఫోన్ పే చేశాడు. అసలు అధికారి తనిఖీలకు వెళ్లగా.. మీకు డబ్బులు పంపానని నిర్వాహకుడు చెప్పాడంతో ఆయన అవాక్కయ్యాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News March 12, 2026
ప్రకాశం: వడగాల్పుల వేళ ముందస్తు చర్యలు

ప్రకాశం జిల్లాలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల సమయాల్లో మార్పులు చేయాలని, మధ్యాహ్నం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి బోర్లు మరమ్మతు చేసి, నీటి కొరత లేకుండా చూడాలని అన్నారు.


