News August 20, 2025

రానున్న 2-3గంటల్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3గంటల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి, హైదరాబాద్, జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, వరంగల్ తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. గంటకు 40కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

Similar News

News March 20, 2026

పండుగలు సమాజానికి కళాశోభను ఇస్తాయి: చిత్రకారుడు రుస్తుం

image

పండుగలు సమాజాలను కళావంతం చేస్తాయని అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన గీసిన ‘రంజాన్ ముబారక్’ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సోదరభావానికి, సామరస్యానికి ప్రతీక అని కొనియాడారు. సమాజంలో ధనవంతులు పేదవారి ఆకలిని గుర్తించి చేయూతనివ్వాలని కోరారు. పవిత్ర ఖురాన్ మార్గంలో నడుస్తూ అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

News March 20, 2026

గుడ్ న్యూస్: డెయిరీ, గొర్రెల ఫారాలకు ఛార్జీల రద్దు

image

AP: రాష్ట్రంలోని డెయిరీ, గొర్రెలు, మేకలు, పందుల పెంపకందారుల నుంచి వసూలు చేస్తున్న బెటర్‌మెంటు, డెవలప్మెంటు ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక నుంచి వీటిని మినహాయిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే వీటికి సంబంధించి మున్సిపాల్టీల పరిధిలోని బిల్డింగ్ పర్మిషన్, లైసెన్స్ ఫీజులను పంచాయతీలతో సమానం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ మినహాయింపులపై GO ఇచ్చారు.

News March 20, 2026

ఏప్రిల్ 1 నుంచి ఆ బ్యాంకుల ఏటీఎమ్ రూల్స్ ఛేంజ్!

image

ATM మనీ విత్‌డ్రాలపై HDFC, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోత విధించాయి. ఇప్పటివరకు సెపరేట్‌గా ఉన్న UPI విత్‌డ్రాల్స్‌ను రెగ్యూలర్ కార్డ్ విత్‌డ్రాల్‌తో HDFC కలిపేయనుంది. దీంతో ఫ్రీ లిమిట్ దాటితే ట్రాన్సాక్షన్‌కు ₹23 చొప్పున ఛార్జ్ పడుతుంది. ఇక PNB రూపే NCMC ప్లాటినమ్ డొమెస్టిక్ సహా పలు వేరియంట్లపై డైలీ విత్‌డ్రాల్ లిమిట్ ₹లక్ష నుంచి ₹50వేలుకు తగ్గించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి.