News August 20, 2025
కవితకు షాక్.. TBGKS గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల

BRS అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) కేంద్ర గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికయ్యారు. HYD తెలంగాణ భవన్‌లో బుధవారం యూనియన్ కేంద్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మొన్నటి వరకు MLC కల్వకుంట్ల కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉండేవారు. ప్రస్తుతం ఆ పదవిని మాజీ మంత్రికి ఏకగ్రీవంగా కేటాయించారు. యూనియన్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు అభినందించారు.
Similar News
News March 15, 2026
సిలిండర్ డోమ్ ఆకారంలోనే ఎందుకు?

LPG గ్యాస్‌ను సిలిండర్‌లో చాలా ఎక్కువ ఒత్తిడి వద్ద నింపుతారు. చతురస్రం లేదా దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటే మూలల వద్ద ఒత్తిడి ఎక్కువై పేలిపోయే ప్రమాదం ఉంటుంది. డోమ్ ఆకారంలో ఒత్తిడి అన్ని వైపులా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగే సిలిండర్లను దొర్లించడం సులభం అవుతుంది. కార్మికులు మోయాల్సిన బాధ తప్పుతుంది. పూర్తిగా గుండ్రంగా ఉంటే ఒకచోట నిలపడం కష్టం. తయారీ ఖర్చు కూడా తక్కువ.
News March 15, 2026
శ్రీకాకుళం: రేపటి నుంచి ఒంటి పూట బడులు

వేసవ తీవ్రత దృష్ట్యా మార్చి 16 నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవి బాబు ఆదివారం తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ జీవో జారీ చేశారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు రేపటి నుంచి ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.
News March 15, 2026
కార్మికులంతా విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి: కలెక్టర్

జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. కార్మికులకు నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, ఆరోగ్య సేవలను స్వయంగా సమీక్షించారు. అనారోగ్య లక్షణాలున్న వారికి తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కార్మికులంతా విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


