News August 20, 2025
AI సాయంతో 2-3గంటల్లో శ్రీవారి దర్శనం: BR నాయుడు

AP: TTDలో పని చేసే అన్యమత సిబ్బందిని మరో విభాగానికి మార్చడం, వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడంపై చర్యలు తీసుకుంటున్నట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. ‘AI సాయంతో 2-3గంటల్లో శ్రీవారి దర్శనం చేయిస్తాం. ఉదయం టికెట్లు తీసుకుంటే సాయంత్రానికి దర్శనమయ్యేలా చూస్తాం. గతంలో VIP దర్శనాలు ఉ.10గంటలకు ఉండటంతో భక్తులు ఇబ్బంది పడేవారు. వాటిని ఉ.8-8.30గంటలకు ముగించేలా చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు.
Similar News
News August 21, 2025
రాత్రి కాఫీ తాగితే ఇంత ప్రమాదమా?

రాత్రులు కాఫీ తాగితే ఎంతో ప్రమాదమని టెక్సస్ యూనివర్సిటీ <
News August 21, 2025
ఏది ఏమైనా టిడ్కో ఇళ్లు కట్టిస్తాం: నారాయణ

AP: లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లో టిడ్కో ఇళ్లు అందజేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ‘గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల గందరగోళం అయ్యింది. పెండింగ్ బిల్స్ రూ.3,664 కోట్లు, కాంట్రిబ్యూషన్ రిటర్న్‌కి రూ.370కోట్లు, ఇళ్లు కట్టడానికి రూ.2,100 కోట్లు కావాలి. 83,072 ఇళ్లు రెడీగా ఉన్నాయి. సంక్రాంతికి మరో లక్ష ఇళ్లు, మిగిలినవి వచ్చే మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని CM ఆదేశించారు’ అని తెలిపారు.
News August 20, 2025
పేదలకు ఇళ్లు.. స్థలాలు గుర్తించాలని సీఎం ఆదేశాలు

AP: వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు. గృహ నిర్మాణ శాఖ సంబంధిత అంశాలపై సచివాలయంలో సమీక్షించారు. మరో 3 నెలల్లో 3 లక్షల ఇళ్లు, సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్లు పూర్తి కావాలని ఆదేశించారు. పట్టణ పేదలకు 2 సెంట్లు, గ్రామీణ పేదలకు 3 సెంట్లు భూమి కేటాయిస్తామన్న హామీ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలని సూచించారు.