News August 20, 2025
ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీలతో కలెక్టర్ సమావేశం

ప.గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల జాబితా సవరణ, అదనపు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, తదితర అంశాలపై చర్చించారు. గత సంవత్సరం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ స్టేషన్ల నందు ఎక్కువ సమయం పోలింగ్ ను నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఇటువంటి విషయాలపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
Similar News
News March 12, 2026
ప.గో: గ్యాస్ పై జేసీ కీలక సూచనలు

జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వదంతులను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయవద్దని సూచించారు. సరఫరా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
News March 12, 2026
ప.గో: వేసవి హెచ్చరిక..

రానున్న వేసవి దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ గీతాబాయి సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో బయటకు వెళ్లరాదని కోరారు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని, తరచుగా మంచి నీరు, కొబ్బరిబొండాలు సేవించాలని హితవు పలికారు. ఎండలో ప్రయాణించేటప్పుడు టోపీలు ధరించాలని ఆమె పేర్కొన్నారు.
News March 12, 2026
ఈ తేదీల్లో చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు బంద్

యలమంచిలి(M) చించినాడ వంతెనపై మరమ్మత్తు పనుల దృష్ట్యా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు నరసాపురం ఆర్డీవో దాసిరాజు తెలిపారు. మార్చి 15, 18, 21, 24, 27, 30 తేదీల్లో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వంతెనపై ఎటువంటి వాహనాలను అనుమతించరు. తమ ప్రయాణ సమయాలను మార్చుకోవాలని ఆయన సూచించారు. ఆయా తేదీల్లో ప్రయాణం చేసే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలన్నారు.


