News August 20, 2025

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ప్రొవిజనల్ లిస్టు విడుదల

image

TG: నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ప్రొవిజనల్ లిస్టును మెడికల్&హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులు MHSRB <>వెబ్‌సైట్‌లో<<>> తమ వివరాలను చెక్ చేసుకుని, ఈ నెల 26 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ సా.5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను సమర్పించాలని సూచించింది. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్‌లో పరీక్ష నిర్వహించగా 40,423 మంది అభ్యర్థులు హాజరయ్యారు. SHARE IT

Similar News

News August 21, 2025

విజ్డన్ ప్లేయర్స్‌లో నంబర్ వన్‌గా జైస్వాల్

image

ప్రపంచంలోనే బెస్ట్ యంగ్ ప్లేయర్‌గా టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ నిలిచారు. విజ్డన్ టాప్-40 ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ టాప్‌లో నిలిచారు. సాయి సుదర్శన్ (9), నితీశ్ (12), తిలక్ వర్మ (14), వైభవ్ (16), హర్షిత్ (21), పరాగ్ (27), ముషీర్ (31), మయాంక్ (33) స్థానాలు దక్కించుకున్నారు. టాప్-10లో జేడెన్ సీల్స్, బెతేల్, ఒరూర్కీ, ప్రిటోరియస్, నసీమ్ షా, గుర్బాజ్, మఫాకా, ఇబ్రహీం జద్రాన్ నిలిచారు.

News August 21, 2025

శ్రీశైలం ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్

image

AP: శ్రీశైలం ఫారెస్ట్ అధికారులపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఘటనపై సవివరంగా నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు. ‘తాము తప్పు చేసినా ఉపేక్షించొద్దని చంద్రబాబు, నేను అసెంబ్లీలో స్పష్టం చేశాం. ప్రజా జీవితంలో ఉన్నవారు తమను తాము నియంత్రించుకోవాలి. ఉద్యోగుల విధి నిర్వహణను ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించొద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు.

News August 21, 2025

ఆగస్టు 21: చరిత్రలో ఈ రోజు

image

1914: సంగీత దర్శకుడు పి.ఆదినారాయణరావు జననం
1963: నటి రాధిక జననం
1978: భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ మరణం
1978: నటి భూమిక చావ్లా జననం
1986: జమైకన్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ జననం
1998: హీరోయిన్ డింపుల్ హయాతి జననం
2013: ‘సాహిత్య అకాడమీ’ గ్రహీత మాలతీ చందూర్ మరణం
* జాతీయ వృద్ధుల దినోత్సవం