News August 20, 2025
GWL: ‘సీఎంఆర్ ధాన్యం డెలివరీ చేయాలి’

సీఎంఆర్ ధాన్యం నిర్దేశించిన గడువులోగా డెలివరీ చేయాలని గద్వాల అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ 2024-25 ధాన్యం గడువు సెప్టెంబర్ 12 వరకు పొడిగించినట్లు తెలిపారు. జిల్లాలోని 37 మిల్లులో నిల్వ ఉన్న 65,366 టన్నుల్లో 38,251 టన్నులు డెలివరీ చేయడం జరిగిందన్నారు. మిగతా బియ్యాన్ని వెంటనే డెలివరీ చేయాలని సూచించారు.
Similar News
News March 14, 2026
RJY: డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా

ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగ మద్యం, గంజాయి సేవనం, జూదం, చైన్ స్నాచింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయడమే లక్ష్యంగా రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాడుబడ్డ ఇళ్లు, అపార్ట్మెంట్లను డ్రోన్ల ద్వారా చిత్రీకరిస్తున్నారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 14, 2026
NRPT: ‘సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోండి’

2025- 26 సంవత్సరానికి గాను ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఎలక్ట్రిక్ ద్వి, త్రిచక్ర వాహనాలు, సోలార్ పంపు సెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని నారాయణపేట అదనపు కలెక్టర్ ఫణీందర్ రెడ్డి శనివారం ప్రకటనలో కోరారు. ఈనెల 17 నుంచి 24 వరకు https://tsobmms.cgg.gov.in వెబ్సైట్లో లేదా మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. 21 నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు అర్హులని అన్నారు.
News March 14, 2026
ఏలూరులో ఈనెల 17న జాబ్ మేళా

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో కెపీడీటీ హైస్కూల్‌లో ఈనెల 17న (మంగళవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యా అభివృద్ధి సంస్థ అధికారి జితేంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. 20 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, 1,497 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, ఎంబీఏ, పీజీ, బీటెక్, ఫార్మసీ విద్య అర్హత కలిగిన 18-35 ఏళ్లవారు అర్హులన్నారు.


