News August 20, 2025
కరీంనగర్: అవుట్ సైడ్ స్వీట్స్ తింటున్నారా..తస్మాత్ జాగ్రత్త

రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు KNRలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నేడు టవర్ సర్కిల్ లో స్వీట్ షాపులను తనిఖీచేశారు.అనిల్ స్వీట్స్& బేకరీ, ఆనంద్ స్వీట్స్,మహారాజా స్వీట్ హౌస్‌లలో అనేక లోపాలు బయట పడ్డాయి.స్వీట్స్ తయారీ కిచెన్ ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, నిల్వ ఉంచిన స్వీట్స్‌పై బల్లి మలం గుర్తించామని అధికారులు తెలిపారు. కలుషితమైన పాలు, అధిక పరిమాణంలో కృత్రిమ రంగుల వాడకం వంటివి గుర్తించారు.
Similar News
News March 15, 2026
రేపు కోటంరెడ్డి మీడియా సమావేశం

కొద్దికాలం విరామం అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ముందుకు రానున్నారు. నిరంతరమైన ప్రజల్లో ఉంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో మీడియా సమావేశాల్లో కాస్త తగ్గించిన అభివృద్ధి జోరు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
News March 15, 2026
BHPL: ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

భూపాలపల్లి జిల్లాలోని అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకుల నుంచి స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారి ఇందిర తెలిపారు. ఈనెల 17 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్లు, సోలార్ పంపు సెట్ల యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. 21-60 ఏళ్ల వయస్సు ఉండి, వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షలలోగా ఉన్నవారు అర్హులు.
News March 15, 2026
విశాఖ: టెన్త్ పరీక్షలు రాసేవారికి బస్సులో ఉచిత ప్రయాణం

పదో తరగతి పరీక్షల దృష్ట్యా, విద్యార్థులు హాల్ టికెట్ చూపి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని విశాఖ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ప్రకటించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం, మధ్యాహ్నం వేళల్లో అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


