News August 20, 2025

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

image

అనంతపురంలోని జేఎన్టీయూ కళాశాలలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్)ను కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఇంక్యుబేటర్లు నుంచి, స్కిల్ డెవలప్మెంట్, మార్కెట్ లింకేజీ తదితర సౌకర్యాలను ఆర్టీఐహెచ్ అందిస్తుంది. విద్యార్థులు అందించే నూతన ఆవిష్కరణలకు, ఆర్థిక సాంకేతిక సహాయం అందిస్తారని వివరించారు.

Similar News

News August 21, 2025

డీసీఎంఎస్ కార్యాలయంలో కలెక్టర్ తనిఖీ

image

రైతులకు అవసరమైన మేరకు ఎరువులు అందించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కళ్యాణదుర్గంలోని డీసీఎంఎస్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. నిల్వ ఉన్న ఎరువులు, రికార్డులు పరిశీలించారు. ఎరువుల పంపిణీలో నిబంధనలు పాటించాలన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News August 20, 2025

పోలీసు శిక్షణా కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

image

అనంతపురం పోలీసు శిక్షణా కేంద్రాన్ని ఎస్పీ జగదీశ్ బుధవారం సందర్శించారు. త్వరలో కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణా తరగతులు ప్రారంభించనున్నారు. శిక్షణకు హాజరయ్యే వారికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు కల్పించాల్సిన అధికారులను ఆదేశించారు. సూచనలు చేశారు. అక్కడ చేపట్టాల్సిన పనుల గురించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

News August 20, 2025

విజయవాడకు చేరిన అనంత అర్బన్ గ్రూప్ పంచాయతీ

image

అనంతపురం జిల్లా కేంద్రంలోని నేతల పంచాయతీ విజయవాడకి చేరింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని కలిసి చర్చించారు. అనంతపురం అర్బన్‌లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మధ్య జరుగుతున్న రాజకీయ పరిమాణాలపై చర్చించారు. అసలు గ్రూపు రాజకీయాలేంటంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.