News August 20, 2025

వనపర్తి: ‘వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి’

image

వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్పీ గిరిధర్ తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు ఎదుటివారికి ఇబ్బందులు కలిగించకుండా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. పెద్ద శబ్దాలతో లౌడ్ స్పీకర్లను ఉపయోగించకూడదని హెచ్చరించారు. విగ్రహాల ఏర్పాటుకు https://policeportal.tspolice.gov.in/index.htm అనే ఆన్‌లైన్ లింక్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 4, 2026

గుండ్ల సింగారం కెనాల్‌లో లభ్యమైన మృతదేహం

image

ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడి గల్లంతైన భీమారం వాసి సాంబయ్య మృతదేహం బుధవారం లభ్యమైంది. సోమవారం సాయంత్రం గుండ్లసింగారం వద్ద ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆయన కొట్టుకుపోయారు. కేయూసీ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, పలువేల్పుల ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

News March 4, 2026

మురికివాడలో టూరిజం.. 2 గం.కు రూ.15,000!

image

ముంబైలోని ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ‘ధారవి’ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. వింతగా అనిపించినా.. ఇక్కడి జీవనశైలిని, కుటీర పరిశ్రమలను చూపించేందుకు గైడ్లు ఒక్కో వ్యక్తి నుంచి 2 గంటలకు రూ.15,000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విదేశీయులు ఈ ‘స్లమ్ టూరిజం’పై ఆసక్తి చూపుతున్నారట. పేదరికాన్ని కూడా ఒక వ్యాపారంగా మార్చడంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

News March 4, 2026

విద్యార్థులకు ఆన్‌లైన్ క్విజ్ పోటీలు

image

జాతీయ సైన్స్ డే వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలాపురంలో ఆన్‌లైన్ క్విజ్ నిర్వహించారు. డీఈవో పి. నాగేశ్వరరావు ఈ పోటీలను ప్రారంభించారు. ఇందులో 262 ప్రభుత్వ, 108 ప్రైవేట్ పాఠశాలల నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 6న 30 పాఠశాలలకు రెండో రౌండ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి జి.వి.ఎస్. సుబ్రహ్మణ్యం వెల్లడించారు.