News August 20, 2025
LHPS రాష్ట్ర కమిటీలో ఇద్దరు కామారెడ్డి జిల్లా వాసులకు చోటు

లంబాడా హక్కుల పోరాట సమితిలో ఇద్దరు కామారెడ్డి జిల్లా వాసులకు చోటు లభించింది. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పెద్ద కొడప్గల్ మండలం విఠల్‌వాడీ తండాకు చెందిన జాదవ్ శ్రావణ్, రాష్ట్ర కార్యదర్శిగా జుక్కల్ మండలం దోస్పల్లికి చెందిన జాదవ్ లక్ష్మణ్‌ను జాతీయ కార్యవర్గం ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యవర్గం నియమించింది. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్ చేతుల మీదుగా వీరు నియామక పత్రాలను అందుకున్నారు.
Similar News
News March 27, 2026
HNK: కోతుల నుంచి తప్పించుకుంటుండగా వ్యక్తి మృతి

జిల్లాలోని శాయంపేట మండలం పత్తిపాకలో విషాదం నెలకొంది. కోతుల గుంపు నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి తడక కరుణాకర్(51) అనే ఎల్ఐసీ ఏజెంట్ దుర్మరణం చెందారు. శుక్రవారం తన ఇంటి పైఅంతస్తులో ఉండగా ఒక్కసారిగా కోతులు మీదకు రావడంతో, వాటి నుంచి తప్పించుకోబోయి అదుపుతప్పి కిందపడ్డారు. తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు.
News March 27, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,950
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,754
*వెండి 10 గ్రాముల ధర రూ.2,328
News March 27, 2026
రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం: సీఎండీ

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ సరికొత్త మైలురాయిని తాకింది. శుక్రవారం రికార్డు స్థాయిలో 6,574 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు సీఎండీ వరుణ్ రెడ్డి వెల్లడించారు. గురువారం నమోదైన 6,457 మెగావాట్ల రికార్డును అధిగమిస్తూ, కేవలం ఒక్క రోజులోనే అదనంగా 117 మెగావాట్ల డిమాండ్ పెరగడం విశేషం. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.


