News April 1, 2024
నేటి నుంచి కొత్త ఈపీఎఫ్ఓ రూల్స్

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా నేటి నుంచి EPFO కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఉద్యోగులు కంపెనీలు మారితే ఆటోమేటిక్‌గా అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అయ్యే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పాత పన్ను విధానాన్ని సెలక్ట్ చేసుకోని వారందరికీ నేటి నుంచి ఆటోమెటిక్‌గా కొత్త పన్ను విధానం అమలు కానుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్‌కు ఆధార్ బేస్డ్ అథంటికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Similar News
News March 12, 2026
కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం!

AP: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 2026-27లో 352 స్కూళ్లలో 6, 11 తరగతుల్లో అడ్మిషన్లకు, 7, 8, 9, 10, 12 తరగతుల్లో ఖాళీ సీట్ల కోసం <
News March 12, 2026
దారుణం: కాలేజీ అమ్మాయిల ఫొటోలు తీసి..

AP: ఏఐతో అద్భుతాలు చేయాల్సిన విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారు. అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ బరితెగిస్తున్నారు. శ్రీకాకుళం(D) గురజాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇటీవల ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా తోటి విద్యార్థినుల ఫొటోలు తీసిన కొందరు ఆకతాయిలు AIతో వాటిని అశ్లీలంగా మార్చారు. విషయం తెలియడంతో అమ్మాయిలు ఆందోళనకు దిగారు. నిందితులకు యాజమాన్యం TCలు ఇచ్చి పంపినట్లు సమాచారం.
News March 12, 2026
డొమెస్టిక్ సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్

TG: రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్‌కు కొరత లేదని.. దీనిపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. హోటల్ పరిశ్రమకు LPG అవసరాలు తీర్చడం పెద్ద సమస్య అని పేర్కొన్నారు. రేపు గ్యాస్ కంపెనీలతో సమావేశమై పరిస్థితిపై ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సిలిండర్లు బ్లాక్ చేస్తే ఏజెన్సీలను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.


