News August 20, 2025
NRPT: ‘శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి’

శాంతియుత వాతావరణంలో పండగలను నిర్వహించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండగల సందర్భంగా బుధవారం నారాయణపేట కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన శాంతి సమావేశానికి ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి హాజరయ్యారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఈసారి కూడా వైభవంగా జరుపుకోవాలని చెప్పారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. ఉత్సవాలకు పటిష్ట పోలీస్ భద్రత ఉంటుందన్నారు.
Similar News
News March 13, 2026
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై వీడని ఉత్కంఠ

ADB విమానాశ్రయ భూసేకరణ వ్యవహారం గందరగోళంగా మారింది. బ్లూప్రింట్ సిద్ధమైందని నేతలు చెబుతుండగా, తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని కలెక్టర్ స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది. రన్‌వే విస్తరణకు 249.81 ఎకరాలు అవసరం కానుంది. దీంతో భూములు ఎటువైపు పోతాయో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనతో బాధితుల్లో భయం పెరిగింది. స్పష్టత ఇవ్వాలని ప్రజలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.
News March 13, 2026
HYD: ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీస్!

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేడు సా.4 గంటలకు సమ్మె నోటీస్ ఇవ్వనుంది. ఉద్యోగుల డిమాండ్లు- ఆర్టీసీ ప్రభుత్వ విలీనం, 2021 పీఆర్సీ, ఉద్యోగ భద్రత, బస్సుల సంఖ్య పెంపు, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు వంటి 11 అంశాలు- పరిష్కారం కాకపోవడంతో సమ్మెకు నిర్ణయించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను పట్టించుకోవడం లేదని జేఏసీ నేతలు విమర్శించారు.
News March 13, 2026
ఏపీ జెన్‌కో ALL TIME RECORD.. సీఎం అభినందన

ఏపీ జెన్‌కో ఈ నెల 11న 6,160 మెగా వాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి చేయడం ద్వారా ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఇందులో భాగస్వాములైన ఉద్యోగులు, సిబ్బందికి CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రాజెక్టుల గరిష్ఠ సామర్థ్యం 6,610 మెగా వాట్లు కాగా 93.19% ఉత్పత్తి సాధించడం గొప్ప విషయమన్నారు. కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో విద్యుత్ రంగం పుంజుకుని వెలుగులు విరజిమ్ముతోంది అనేందుకు ఈ ఘనత సాక్ష్యమని తెలిపారు.


