News August 20, 2025
పోచారం ప్రాజెక్టును పరిశీలించిన ఇరిగేషన్ డీఈ

పోచారం ప్రాజెక్టును డీఈ వెంకటేశ్వర్లు ఈరోజు పరిశీలించారు. లింగంపేట పెద్దవాగు, గుండారం వాగుల ద్వారా ప్రాజెక్టులోకి 3,904 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 22 అడుగుల నీరు ఉందని చెప్పారు. 3,854 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో నీటి పారుదలశాఖ సిబ్బంది ఉన్నారు.
Similar News
News August 21, 2025
కర్నూలు: మృతి చెందిన ఆరుగురు చిన్నారులు వీరే..! PHOTO

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో నీటి కుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఎర్రబాడు కిష్టప్ప-నాగవల్లి కుమారుడు శశి కుమార్, ఎర్రబాడు రాజు-మార్తమ్మ కుమారుడు కిన్నెర సాయి, మహారాజు-మమత కుమారుడు సాయికిరణ్, రాముడు-లక్ష్మీ కుమారుడు భీమేశ్, ఈరన్న-ఎల్లమ్మ కుమారుడు వీరేంద్ర, పెరవలి-హసీన కుమారుడు మహబూబ్‌గా గుర్తించారు.
News August 21, 2025
నేడు మంత్రివర్గ సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతి పనుల పురోగతి, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రూ.904 కోట్లతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు ఆమోదం పలకనుందని సమాచారం. కొత్త జిల్లాల పేర్లు మార్పు, ఏర్పాటుపై కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.
News August 21, 2025
సంగారెడ్డి: ఎంపికైతే నెలకు రూ.6వేలు

2035-26 సంవత్సరానికి దీన్ దయల్ స్పర్శ యోజన ఉపకార వేతనాల కోసం సెప్టెంబర్ 13 వరకు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పోస్టల్ డివిజన్ శ్రీహరి బుధవారం తెలిపారు. 6 నుంచి 11వ తరగతి వరకు చదివే విద్యార్థులు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.6 వేల ఉపకార వేతనం అందుతుందని పేర్కొన్నారు.