News August 20, 2025

ముస్తాబాద్: ‘విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు’

image

నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల SP మహేష్ బి గీతే అన్నారు. ముస్తాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తు విషయంలో ఎలాంటి అలసత్వం వహించద్దని సూచించారు. ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతిరోజు తనిఖీ చేయాలని ఆదేశించారు.

Similar News

News March 12, 2026

ఇరాన్ కండీషన్స్‌ అమలు సాధ్యమేనా?

image

యుద్ధం ఆపడానికి ఇరాన్ పెట్టిన <<19359163>>కండీషన్స్<<>> నెరవేరడం సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. ఇరాన్‌లో పాలన మార్పు, అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్/US యుద్ధాన్ని ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హక్కులను గుర్తిస్తూ భద్రతకు హామీ ఇవ్వడం జరిగే పనికాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నష్టపరిహారం ఇవ్వడానికీ అగ్రరాజ్యం ఒప్పుకోదంటున్నారు. దీంతో యుద్ధం మరింత కాలం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

News March 12, 2026

HYD: ఇంటర్ 1st ఇయర్ పరీక్షలు ఖతం.. ఫుల్ ఖుష్

image

ఇంటర్ 1st ఇయర్ పరీక్షలు ఇవాళ్టితో ముగిశాయి. బీఎన్‌రెడ్డినగర్ దగ్గర విద్యార్థులందరూ పరీక్ష సెంటర్ వద్ద ఫ్రెండ్స్ కలుసుకుని ‘పరీక్షలు ఎలా రాశావ్.. పాస్ అవుతావా’ అని కనుక్కుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో కలుద్దామని ఒకరినొకరు కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి పయనమయ్యారు. కాగా HYDలో ప్రైవేట్ హాస్టల్స్ కొన్ని కొన్నిగా ఖాళీ అవుతున్నాయి. రేపటితో ఇంటర్ 2nd ఇయర్ పరీక్షలు ముగియనున్నాయి.

News March 12, 2026

మార్కాపురంలో కొత్తగా రూర్బన్ పంచాయతీలు

image

పంచాయతీ జనాభా వార్షిక ఆదాయం, భౌగోళిక స్వరూపం ఆధారంగా ప్రభుత్వం విభజన చేపట్టింది. ఇప్పటివరకు ఐదు గ్రేడులుగా ఉండగా వాటిని నాలుగు గ్రేడులుగా కుదించింది. కొత్తగా రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు చేశారు. మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీలు ఉండగా వాటిలో 8 రూర్బన్, 63 గ్రేడ్-1, 108 గ్రేడ్-2, 227 గ్రేడ్-3 పంచాయతీలుగా విభజించారు. రూర్బన్ పంచాయతీలకు గెజిట్ అధికారిని కార్యదర్శిగా నియమించనున్నారు.