News August 20, 2025

గంభీరావుపేట: ‘పాడి పశువులను సద్వినియోగం చేసుకోవాలి’

image

పాడి పశువులను సద్వినియోగం చేసుకొని పేద కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. గంభీరావుపేట మండలం దేశాయిపల్లి గ్రామంలోని ప్రగతిభవన్ లో 17 మంది ఎస్సీ లబ్దిదారులకు ఒక్కరికి 2 చొప్పున మొత్తం 34 పాడి పశువులను కలెక్టర్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పంపిణీ చేసే పశువులు డెలీవరి తర్వాత 12 నుంచి 15 లీటర్ల పాలు ఇస్తుందన్నారు.

Similar News

News March 5, 2026

పాలమూరు: కోడి తెచ్చిన కొట్లాట.. ముగ్గురిపై కేసు

image

కుటుంబ వివాదంతో ఒకరిపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైనట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు గౌడ్ తెలిపారు. లింగాలకు చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తి ఇంట్లో కోడి చనిపోవడంతో దంపతుల మధ్య ఘర్షణ తలెత్తింది. భార్యను భర్త మందలించడంతో మల్లికార్జున్ మామ రత్నయ్య, వెంకటేశ్, శేఖర్ అతడిపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన మల్లికార్జున్ పోలీసులను ఆశ్రయించగా, నిందితులపై కేసు నమోదు చేశారు.

News March 5, 2026

తూ.గో: కల్తీ పాల ఘటనలో మరొకరి మృతి

image

రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య బుధవారం నాటికి 8కి చేరింది. తాజాగా సూర్యకుమారి అనే మహిళ మృతి చెందగా, మృతుల్లో ఆరేళ్ల బాలుడు సహా ఏడుగురు వృద్ధులు ఉన్నారు. ప్రస్తుతం 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో 9 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తున్నప్పటికీ బాధితుల పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 5, 2026

ఆవులూరు ఆలేరుగా ఎలా మారింది?

image

ఆలేరు ప్రాంతానికి ఆ పేరు రావడం వెనుక ఆసక్తికర చరిత్ర ఉంది. పూర్వం ఇక్కడ ఆవులు అధికంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ‘ఆవులూరు’ అని పిలిచేవారు. కొలనుపాకలోని జైన, సోమేశ్వరాలయాల పూజలకు ఇక్కడి నుండే నిత్యం ఆవు పాలను పంపేవారు. కాకతీయ రాజుల కాలంలోనూ ఇక్కడి పాలకు ప్రాముఖ్యత ఉండేది. కాలక్రమేణా ఆవులూరు కాస్తా ‘ఆలేరు’గా రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతోంది.