News August 20, 2025
మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన రామగుండం సీపీ

రామగుండం కమిషనరేట్‌లో మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని సీపీ అంబర్ కిషోర్ బుధవారం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతనంగా ఈ వాహనాన్ని అందించింది. ఈ మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షలను నిర్వహించి సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాథమిక సాక్ష్యాధారాలను అందజేయడం జరుగుతుందని సీపీ తెలిపారు.
Similar News
News March 13, 2026
NGKL: 60 కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు

పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జిల్లా విద్యాధికారి రమేశ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 265 పాఠశాలల విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు.
News March 13, 2026
పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు: ఎస్పీ

మెదక్ జిల్లాలో పదో తరగతి పరీక్షల కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జిల్లాలోని అన్ని కేంద్రాల వద్ద 163 BNSS అమలులో ఉంటుందని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.
News March 13, 2026
చెరువుల పరిరక్షణే లక్ష్యం: HNK కలెక్టర్

జిల్లాలోని చెరువులు, కుంటలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని HNK కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. జల వనరుల్లో సిల్ట్ పేరుకుపోవడం, కాలుష్య కారకాలు చేరడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చెరువుల నీటి నాణ్యతను కాపాడుతూ, జీవవైవిధ్యానికి భంగం కలగకుండా పక్కా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.


