News August 20, 2025
ప్రకాశం: 9 మంది HCలకు ASIలుగా పదోన్నతి

జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఖాళీల ఆధారంగా 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు(HC) అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI) హోదాకు పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ దామోదర్ బుధవారం ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన వారిని తన కార్యాలయంలో ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదోన్నతి పొందడం ఒక గౌరవ కారణమన్నారు.
Similar News
News August 21, 2025
పొదిలి: టీ తాగి వస్తానని భర్త పరార్.!

పొదిలిలోని పోతవరానికి చెందిన యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్న భార్యకు మొహం చాటేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు బుధవారం పొదిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని ఆర్మూరు బస్ స్టేషన్‌లో టీ తాగి వస్తానని వదిలేసి పరారయ్యాడని, తీరా పొదిలికి వస్తే రూ.10 లక్షలు తెస్తేనే భార్యగా అంగీకరిస్తానని చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News August 21, 2025
పొదిలి: టీ తాగి వస్తానని భర్త పరార్.!

పొదిలిలోని పోతవరానికి చెందిన యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్న భార్యకు మొహం చాటేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు బుధవారం పొదిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని ఆర్మూరు బస్ స్టేషన్‌లో టీ తాగి వస్తానని వదిలేసి పరారయ్యాడని, తీరా పొదిలికి వస్తే రూ.10 లక్షల తెస్తేనే భార్యగా అంగీకరిస్తానని చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News August 21, 2025
ఒంగోలు: బాలికను గర్భిణీని చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాలికను గర్భవతిని చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. 2019 జనవరిలో కొత్తపట్నంలో నిందితుడు చంటి బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దీనిపై విచారణ అనంతరం నిందితుడికి శిక్ష పడింది. పోలీసులను ఎస్పీ దామోదర్ అభినందించారు.